Yeto Vellipoyindhi Manasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yeto Vellipoyindhi Manasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2021, శనివారం

Yeto Vellipoyindhi Manasu : Yenthentha Dhooram Song Lyrics (ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా)

చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు (2012)

సంగీతం : ఇళయరాజా

రచన : అనంత శ్రీరామ్

గానం:కార్తీక్


ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా.. పోపోమన్నా.. పొద్దున్నైతే సూర్యుణ్ణై వస్తా.. వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా.. సందెల్లోనా చంద్రుణ్ణై వస్తా.. చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా.. మధ్యాహ్నంలో దాహాన్నై మధ్య మధ్య మోహాన్నై వెంటుండి వెంటాడుతా.. రోజూ రోజూ ఇంతే.. ఏ రోజైనా ఇంతే.. నీడై జాడై తోడై.. నీతో వస్తానంతే.. నే నిన్నెపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా.. పోపోమన్నా.. అద్దంలోనా నేనే కనిపిస్తా.. అందాల చిందుల్లోనా మువ్వై వినిపిస్తా.. చుట్టూ ఉంది నేనే అనిపిస్తా.. ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డొస్తా.. మబ్బుల్లో మాటేసి.. వెన్నెల్లో వాటేసి.. ప్రాణాన్ని ముద్దాడుతా.. ఏ జన్మైనా ఇంతే.. పై లోకానా ఇంతే.. ఆది అంతం అన్నీ.. నేనే అవుతా అంతే.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా..