Yuva Ratna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yuva Ratna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Yuva Ratna : Sanna Jaji Puvva Song Lyrics (సన్నజాజి పువ్వా)

చిత్రం: యువరత్న (2002)

సాహిత్యం: చంద్ర బోస్

గానం: సాధన సర్గం, కళ్యాణ్ మల్లిక్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పల్లవి :

సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా నీ చిరు చిరు నగవుల కిలకిల సడితో వలపుల పాటలు పాడవా వలపుల తెలుగుల తొలిపిలుపులలో చెలిమికి నా మది చూపవా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో వలపుల పాటలు పాడవా వలపుల తెలుగుల తొలి పిలుపులలో చెలిమికి నా మది చూపవా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా చరణం 1:

ఏ తోటలో ఏ కొమ్మకో తారల్లే విరిసినపువ్వా నాలో కోరిక వినవా తన సిగలో జాబిలి కావా వేసంగిలో వెన్నెలలో గువ్వల్లే మెరిసిన పువ్వా నాలా నువ్వై పోవా తన ఒడిలో పాపవు కావా పసి పసి మనసుల మొరలను వినవా మధురిమ మంత్రం వీయ్యవా మా పరుగుల ఉరుకుల ప్రేమనుత్రోవ పరిమళ భరితము చేయవా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా చరణం 2:

ముత్యానికే ముస్తాబులా తెల్లంగా పూచిన పువ్వా నాతో ఏకం కావా తన పదముల పూజకు రావా గోదారికే పైటంచుల స్వచ్ఛంగా విచ్చిన పువ్వా నాలో సిగ్గును కనవా నా తేనేలు తనకందీవా ఇటు అటు తెలియని వయసుల గొడవ ఇదియని నువ్వే తేల్చవా మా ఇరువురి నడుమున వారధి కావ ఈ ఒక సాయం చేయవా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా