చిత్రం: శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం: ఇళయరాజ
సాహిత్యం: వంశీ, ఇళయరాజ
గానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి
వెన్నెలై
పాడనా?
నవ్వులే
పూయనా?
మల్లెలే
పొదగనా?
పూవులో నవ్వులో మువ్వలా
ఒంపులో సొంపులో కెంపులా
కలకల పొదలో కిలకిల కధనం
ముసిమిసి రొదలో అలసట మధురం
పొద్దులో
మీటనా?
ముద్దులే
నాటనా?
హద్దులే
దాటనా?
ఇవ్వనా యవ్వనం పువ్వునై?
గువ్వనై గవ్వనై నవ్వనా?
లలనామణినై తలలోమణినై
నవలామణినై చింతామణినై
లీలగా తూగుతూ ఏమిటో దేహమె
వేడుకా ధారలే దాహమై కోరిన
పాడుతూ వేడినా కోరుతూ పాడినా
భేషజం చూపుతూ దోహదం చేయవు
మోవికెంపు బాధ గుండె మువ్వ గాధ
పొద్దు పువ్వులాగ నవ్వుతుంది చూడు
వెలుతురు నేత్రమే సోకని ప్రాంగణము
గాలికే ఊపిరి పూసే పరిమళము
చందనం పూయనా పూలలో రాజుకి?
నోచిన నోముకే పూచినా రోజుకి
సుందరం ధూపమే వేయనా పూజకి?
జాలిగా గాలిలో వీచినా మోజుకి
ప్రమిద కాంతి పువ్వు
ప్రమద చిలుకు నవ్వు
కలికి కలలు రాసే కధల పురము వాసి
బ్రతుకున పలికిన కిలకల కూజితము
మధురమై మొలవనీ ఉలిశిల ఖేలనము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి