(Female) రంగా రంగా సింగారంగా
రారా సారంగా
(Male) శృంగారంగా చిందేయంగా
రావే సరసంగా
(Female) భారంగా వంగే సొంపులు కోరంగా
వచ్చే సాయంగా
(Male) తీయంగా అల్లి తీర్చన నీ బెంగ
(Female) రంగా రంగా సింగారంగా
రారా సారంగా
(Male) శృంగారంగా చిందేయంగా
రావే సరసంగా
చరణం1:
(Male) విరిసే వయసా
నీ చిక్కని సొంపుల చక్కదనానికి
చిక్కనివాడొక మనిషా
(Female) పిలిచే వరసా
నులి వెచ్చని ముచ్చట తెరిచిన కౌగిట
నలగని నాదొక సొగసా
(Male) నవ నవమను నీ పరువం
కువ కువ మను కోసిన తరుణం
(Female) పిట పిట మను పడుచుదనం
పద పడమను ఈ నిముషం
(Male) అదిరే అందాల పెదవే కందాలి
ముదిరే ముద్దాటలో
(Female) రంగా రంగా సింగారంగా
రారా సారంగా
(Male) శృంగారంగా చిందేయంగా
రావే సరసంగా
చరణం2:
(Female) కసిగా కసిరే
చెలి కమ్మని తిమ్మిరి ఘమ్మున తీర్చగ
కమ్ముకు రావేం పురుషా
(Male) సుఖమే అడిగే
సఖి ముచ్చట తీరగ వెచ్చని వేడుక
పంచుటకే కద కలిశా
(Female) తహతహ మను దాహంతో
తపనలు పడు సంపదలివిగో
(Male) అలుపెరుగని మోహంతో
కలపడు మగతనమిదిగో
(Female) నడుమే నవ్వేల తడిమే నీ చేతి
చలువే చూపించుకో
(Female) రంగా రంగా సింగారంగా
రారా సారంగా
(Male) శృంగారంగా చిందేయంగా
రావే సరసంగా
(Female) భారంగా వంగే సొంపులు కోరంగా
వచ్చే సాయంగా
(Male) తీయంగా,,, అల్లి తీర్చన నీ బెంగ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి