30, మే 2021, ఆదివారం

Jagadekaveeru Athiloka Sundhari : Priyatama song Lyrics (ప్రియతమా )

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:ఇళయరాజా



Female: ప్రియతమా నను పలకరించు ప్రణయమా.. అతిథిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా Male :మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా.. Female: ప్రియతమా నను పలకరించు ప్రణయమా.. అతిథిలా నను చేరుకున్న హృదయమా ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..


Female: నింగి వీణకేమో నేల పాటలొచ్చె             తెలుగు జిలుగు అన్నీ కలిసి             పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ Male: వలపె తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే .. వరుడై నాలో మెరిసే Female:తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే Male: మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం Female: తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం Male: రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో Female: రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో అడుగే పడక గడువే గడిచి పిలిచే (ప్రియతమా)

Female:ప్రాణవాయువులో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి             దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి Male: వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి             మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి Female: నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం Male: నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం Female: వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో Male: అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి