చిత్రం: ఆఖరి పోరాటం(1988)
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, లత మంగేష్కర్
సంగీతం: ఇళయ రాజా
పల్లవి:
తెల్ల చీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె యెన్నెల్లో సిరిమల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా.. ఇలా హాయిగా స్వరాలూదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లో అహ.. తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె యెన్నెల్లో చరణం 1:
వైశాఖం తరుముతుంటే..నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే..నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలవ్వాలి.. పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే !!
నీ తోడుకావాలి నే తోడుకోవాలి
నీ నీడలోవున్న శృంగారమే !!
జాబిల్లి..సూరీడు... ఆకాశంలో నిలిచిన సొగసుల
తెల్ల చీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె యెన్నెల్లో సిరిమల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లోచరణం 2:
కార్తీకం కలిసివస్తే..నీ పరువం అడుగుతున్నా
హేమంతం కరుగుతుంటే..నీ అందం కడుగుతున్నా
ఆకాశదేశాన ఆ మేఘరాగాలు
పలికాయి నా స్వప్న సంగీతమే !!
ఈ చైత్రమాసాల చిరునవ్వుదీపాలు
వెలిగాయి నీ కంట నాకోసమే !!
గిలిగింతే..గీతాలై.. సింగారానికి సిగ్గులు కలిపిన
తెల్ల చీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె యెన్నెల్లో సిరిమల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లోఅవే తీయని సరాగాలుగా..
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో
సాయంత్రాలే సంగీతాలై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి