Aakhari Poratam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aakhari Poratam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2025, శనివారం

Aakhari Poratam : Eppudu Eppudu Song Lyrics (ఎప్పుడు ఎప్పుడు)

చిత్రం: ఆఖరి పోరాటం(1988)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం: ఇళయ రాజా




పల్లవి :

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 

నీ వంపుల సొంపే నా వంటికి పంపే
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....
ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


చరణం 1 :

ఒక మాటు ఒడిని మీటి...  
ఒక మాటు ఒడిని మీటి... వలపు రాగాలు లాగేసుకుంటాలే 

పొద చాటు కథలు దాటి...  
పొద చాటు కథలు దాటి... చిలిపి తాళాలు మోగించుకుంటాలే  

ఎప్పటికప్పుడు దప్పిక తీరని చెప్పని దాహాలే
ఏమని చెప్పను నీకు జవాబులు పైటల పాప

అచ్చట ముచ్చట ఇచ్చట గిచ్చుడు పెంచిన మొహాలే
ఎంతని ఆపను నిన్ను మరీ మది బిత్తరపోక

చక్కని చుక్క తన సొంతం అనుకోమాక బలవంతం 
కోరికలే ఓపికలై మోజులు తెచ్చిన అల్లరిలో 

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే నా వంటికి పంపే
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....
ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 



చరణం 2 :

పొరపాటో తెరకు చాటో...  
పొరపాటో తెరకు చాటో... వయసులాటాడుకోవాలి ఈనాడే 
అది ఆటో పెదవి గాటో...  
అది ఆటో పెదవి గాటో ... మధుర గాయాలు తాకాలి లోలోనే

చప్పున ఆరని నిప్పుల కుంపటి రేపిన తాపాలే
చల్లని వెన్నెల చిచ్చుల ఉచ్చులు వేసెను నాకే

అచ్చిక బుచ్చిక పిచ్చిగ మచ్చిక చేసిన అందాలే
జంటగ తుంటరి రెప్పల గంటలు కొట్టెను నేడే

చమ్మని చక్కే మన ఆట...  మల్లెల పక్కే మన తోట
నవ్వులతో పువ్వులతో రివ్వులు పెట్టిన ప్రేమలలో

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 

నీ వంపుల సొంపే నా వంటికి పంపే
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 

Aakhari Poratam : Swati Chinuku Song Lyrics (స్వాతి చినుకు )

చిత్రం: ఆఖరి పోరాటం(1988)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం: ఇళయ రాజా


పల్లవి :

స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వణుకు అందగత్తెలో... హొయ్
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
భలేగుంది పడుచు ముచ్చటా... హా
భలే కదా గాలి ఇచ్చటా...

స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వలపు అందగాడిలో... హొయ్
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పదా అంది పడుచు పూపొదా..హోయ్..
ఇదే కదా చిలిపి ఆపదా 


చరణం 1 :

ఈ గాలిలో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన
స్వాతి చినుకు సందెవేళలో.. హొయ్
లేలేత వణుకు అందగత్తెలో.. హొయ్
మబ్బే కన్ను గీటే మతే పైట దాటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా... హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
భలేగుంది పడుచు ముచ్చటా ...హా
భలే కదా గాలి ఇచ్చటా 


చరణం 2 :

యా యా యా యా యా యా....
ఈ వానలా కథేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన

స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వలపు అందగాడిలో హొయ్
ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా

26, జూన్ 2021, శనివారం

Aakhari Poratam : Tella Cheeraku Song Lyrics (తెల్ల చీరకు తకధిమి తపనలు)

చిత్రం: ఆఖరి పోరాటం(1988)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, లత మంగేష్కర్

సంగీతం: ఇళయ రాజా



పల్లవి:

తెల్ల చీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె యెన్నెల్లో సిరిమల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా.. ఇలా హాయిగా స్వరాలూదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లో అహ.. తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె యెన్నెల్లో చరణం 1:
వైశాఖం తరుముతుంటే..నీ ఒళ్ళో ఒదుగుతున్నా ఆషాఢం ఉరుముతుంటే..నీ మెరుపే చిదుముకున్నా కవ్వింతలవ్వాలి.. పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే !! నీ తోడుకావాలి నే తోడుకోవాలి నీ నీడలోవున్న శృంగారమే !! జాబిల్లి..సూరీడు... ఆకాశంలో నిలిచిన సొగసుల

తెల్ల చీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె యెన్నెల్లో సిరిమల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లో


చరణం 2: కార్తీకం కలిసివస్తే..నీ పరువం అడుగుతున్నా హేమంతం కరుగుతుంటే..నీ అందం కడుగుతున్నా ఆకాశదేశాన ఆ మేఘరాగాలు పలికాయి నా స్వప్న సంగీతమే !! ఈ చైత్రమాసాల చిరునవ్వుదీపాలు వెలిగాయి నీ కంట నాకోసమే !! గిలిగింతే..గీతాలై.. సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్ల చీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె యెన్నెల్లో సిరిమల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మా జంట ముద్దుల్లో

అవే తీయని సరాగాలుగా.. ఇలా హాయిగా స్వరాలూదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

Aakhari Poratam : Abba Deeni Soku Song Lyrics (అబ్బ దీని సోకు సంపంగి రేకు)

చిత్రం: ఆఖరి పోరాటం(1988)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్ చిత్ర

సంగీతం: ఇళయ రాజా



పల్లవి :

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు 


చరణం 1 :

దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలా
కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా
సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా
చిమ్మచీకట్లు సిగ్గుపడ్డాక నిన్ను నేనల్లుకోనా
ఒడ్డులేని ఏరు ఒడేల భామా అడ్డులేని ప్రేమా ఇదేనులే
ముద్దుపెట్టగానె ముళ్ళుజారిపోయే
వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి
చాటు చూసి దాటుతుంటే తంటా
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 


చరణం 2 :

ఎన్ని బాణాలు వేస్తావు నీవు...  తీపిగాయలతో చెప్పనా
ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో...  కంటికే నోరు మూసెయ్యనా
ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా
తెడ్డులేని నావా చలాకి ప్రేమా...  సందు చూసి పాడే సరాగమే
బొట్టు పెట్టగానే గట్టు జారిపోయే
వెన్నెలంటి సోకులన్ని ఈలవేసి ఇవ్వబోతే
ముందుగానె దోపిడైతె .... టాటా

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు