చిత్రం: ఆరు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: టిప్పు, శ్రీనివాసన్, సుమంగళి
చరణం:-
చూడొద్దే నను చూడొద్దే చురకత్తి లాగా నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లోద్దే మది గూడు దాటి వదిలెల్లోద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే ,
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే
చూడొద్దే నను చూడొద్దే చురకత్తి లాగా నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లోద్దే మది గూడు దాటి వదిలెల్లోద్దే
చరణం:-1
వద్దు వద్దంటూ నేనున్నా వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్నా హృదయాన్ని లాగింది నువ్వేగా ,
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా......
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే,
నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే
చూడొద్దే నను చూడొద్దే చురకత్తి లాగా నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లోద్దే మది గూడు దాటి వదిలెల్లోద్దే
చరణం:-2
హో.....హో.... హో..హో....హో...హో....హో....హా....హ....హో..హో.....
వద్దు వద్దంటూ నువున్న వలపే పుట్టింది
నీపైన ,కాదు కాదంటూ నువున్న కడలే పొంగింది నాలోన
కన్నీళ్ల తీరంలో పడవల్లే నిలుచున్నా
సుడి గుండాల శృతి లయలో పిలుపే ఇస్తున్న
మంటలు తగిలిన పుట్టడిలో మెరుపే కలుగునులే
వంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే.....
చూడొద్దు నను చూడొద్దు చురకత్తి లాగా నను చూడొద్దు
వెళ్లొద్దు వదిలెళ్లొద్దు మది గూడు దాటి వదిలెల్లోద్దు
అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీ పేరే
చూడొద్దే నను చూడొద్దే చురకత్తి లాగా నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లోద్దే మది గూడు దాటి వదిలెల్లోద్దే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి