చిత్రం: ఆరు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: శ్రీనివాస్, శ్రీలేఖ పార్థసారథి
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే వయసు అను గగనంలో మనసు అను మేఘంలో చిరు ఆశల వర్షంలొ నన్ను గుచ్చి గుచ్చి తడిపావే నా అనువు అనువు నువ్వేలె నీ తనువు తనువు నాదేలె ప్రతి క్షణము క్షణము మనదేలె ఓ చెలీ హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే హ వెన్నెల వల విసిరి నీ కన్నులు వెలిగిస్త మెరుపుల మెడ వంచి నీ మెడలొ గొలుసేస్తా చుక్కలు అన్ని చేపలు చేసి నీకె కమ్మని విందిస్త మబ్బుని దించి సబ్బుగ మార్చి నీకె స్నానం చేయిస్తా హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే కాలికి రెక్కలు కట్టి నీ కౌగిట వాలిపోత పూలని అప్పడిగి పూరేకుని చీర చుడత హ ఆకాశాన్నె చాపె చుట్టి నీకె పరుపుగ పరిచేస్త సూర్యున్నె ఓ గుద్దుతొ చంపి పొద్దె పొడవని ముద్దిస్తా హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే