చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
చరణం 1:
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
గువ్వా గువ్వా కౌగిల్లో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదీ లేని గానము
చరణం 2:
నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు అదే బాసగా అదే ఆశ గా అదే బాసగా అదే ఆశ గా ఎన్ని నాళ్ళీ నిన్న పాటే పాడను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి