Abhinandana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Abhinandana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జులై 2021, గురువారం

Abhinandana : Prema Entha Madhuram Song Lyrics (ప్రేమ ఎంత మధురం)

చిత్రం : అభినందన (1988)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: ఆత్రేయ

గానం: బాలసుబ్రహ్మణ్యం



పల్లవి: ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం మింగినాను హాలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చరణం:1 ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు కన్నీరుగా ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చరణం:2 నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం మింగినాను హాలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

Abhinandana : Manchu Kuruse Velalo Song Lyrics (మంచు కురిసే వేళలో )

చిత్రం : అభినందన (1988)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: ఆత్రేయ

గానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి



పల్లవి: మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో..... చరణం: 1 నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో…... చరణం: 2 మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మథునితో జన్మ వైనం చాటినపుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో…...


Abhinandana : Rangulalalo Kalavo Song Lyrics (రంగులలో కలవో.. )

చిత్రం : అభినందన

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: ఆత్రేయ

గానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి


రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో (2) నవ శిల్పానివో.. రతి రూపానివో తొలి ఊహల ఊయలవో !! రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో *కాశ్మీర నందన సుందరివో (2) కైలాస మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో (2) మరుని బాణమో.. మధుమాస గానమో నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా !! రంగులలో కలనై.. *ముంతాజ్ అందాల అద్దానివో (2) షాజహాన్ అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో (2) ప్రణయ దీపమో.. నా విరహ తాపమో నా చిత్రకళల చిత్ర చైత్ర రథమో రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా !! రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై

13, జూన్ 2021, ఆదివారం

Abhinandana : Edhuta Neeve SongLyrics (ఎదుట నీవే ఎదలోన నీవే)

  చిత్రం : అభినందన

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: ఆత్రేయ

గానం: బాలసుబ్రహ్మణ్యం


పల్లవి:

ఎదుట నీవే ఎదలోన నీవే

ఎదుట నీవే ఎదలోన నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే


చరణం 1:

మరుపే తెలియని నా హృదయం

తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం

గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు

కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు

పిచ్చివాణ్ణీ కానీదు


చరణం 2:

కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను

వేదన పడ్డాను

స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా

స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా

ప్రేమకింత బలముందా

Abhinandana : Ade Neevu Ade Nenu Song lyrics (అదే నీవు అదే నేను)

 చిత్రం : అభినందన

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: ఆత్రేయ

గానం: బాలసుబ్రహ్మణ్యం


అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కధైనా కలైనా కనులలో చూడనా కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము గువ్వా గువ్వా కౌగిల్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏదీ లేని గానము నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు అదే బాసగా అదే ఆశ గా అదే బాసగా అదే ఆశ గా ఎన్ని నాళ్ళీ నిన్న పాటే పాడను

Abhinandana : Premaledhani Song Lyrics (ప్రేమ లేదని ప్రేమించరాదని)

 

 చిత్రం : అభినందన

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: ఆత్రేయ

గానం: బాలసుబ్రహ్మణ్యం


పల్లవి: లాలల లలాలాల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ... ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు చరణం 1: మనసు మాసిపోతే మనిషే కాదని కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లలలాలలాల చరణం 2: గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలల లలాలాల లాలల లలాలాల