6, జూన్ 2021, ఆదివారం

Antham : Nee Navvu Cheppindi Song Lyrics (నీ నవ్వు చెప్పింది)

చిత్రం: అంతం (1992)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఆర్. డి. బర్మన్, మణి శర్మ


పల్లవి: నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ల లోటేమిటో.. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో చరణం:1 నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపునీ పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని చరణం:2 నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ నా పెదవి లోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందనీ చరణం:3 ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి