30, జూన్ 2021, బుధవారం

Samsaram Oka Chadarangam : Samsaram Oka Chadarangam Song Lyrics (సంసారం ఒక చదరంగం...)

చిత్రం: సంసారం ఒక చదరంగం(1987)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 


సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు... ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. గుండెలే..బండగా..మారిపోయేటి స్వార్ధం తల్లినీ.. తాళినీ.. డబ్బుతో తూచు బేరం రక్తమే..నీరుగా.. తెల్లబోయేటి పంతం కంటికీ..మంటికీ..ఏకధారైన శోకం తలపై విధి గీత ఇల పైనే వెలసిందా? రాజులే బంటుగా మారు ఈ క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేళిలో ధనమే తల్లి.. ధనమే తండ్రి.. ధనమే దైవమా..!!?? సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం... స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు...ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కాలిలో..ముల్లుకీ..కంట నీరిచ్చు కన్ను కంటిలో..నలుసునీ..కంట కనిపెట్టు చెల్లీ! రేఖలు.. గీతలు..చూడదీ రక్తబంధం, ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం!! గదిలో ఇమిడేనా మది లోపల మమకారం?? పుణ్యమే..పాపమై..సాగు ఈ పోరులో, పాపకే పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. ప్రాణాలు తీసినా.. పాశాలు తీరునా... అదుపు లేదు.. ఆజ్ఞ లేదు..మమకారాలలో!! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కౌగిలే.. కాపురం.. కాదులే పిచ్చి తల్లీ, మల్లెల.. మంచమే.. మందిరం కాదు చెల్లీ, తేనెతో.. దాహము.. తీర్చదేనాడు పెళ్లి త్యాగమే.. ఊపిరై.. ఆడదయ్యేను తల్లి కామానికి దాసోహం.. కారాదే సంసారం! కాచుకో.. భర్తనే.. కంటి పాపాయిగా, నేర్చుకో.. ప్రేమనే.. చంటి పాపాయిగా, మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము.. ప్రేమే వేదాంతము వయసు కాదు.. వాంఛా కాదు.. మనసే జీవితం సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం చుక్కలు.. జాబిలి.. చూసి నవ్వేది కావ్యం నింగికే.. నిచ్చెన.. వేసుకుంటుంది బాల్యం తారపై.. కోరిక.. తప్పురా చిట్టి నేస్తం రెక్కలే.. రానిదే.. ఎగరనేలేదు భ్రమరం వినరా ఓ సుమతీ..పోరాదు ఉన్న మతి!! పాత పాఠాలనే దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా నిను పెంచేది.. గెలిపించేది.. చదువే నాయనా!! సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరు స్వప్నం ఈ గాలి వానలో..ఈ మేఘ మాలలో ఉరిమే మబ్బు.. మెరిసే బొమ్మ.. చెరిపే వేళలో సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరుస్వప్నం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి