Samsaram Oka Chadarangam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Samsaram Oka Chadarangam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

Samsaram Oka Chadarangam : Janaki Ramula Kalyananiki Song Lyrics (జానకి రాముల కల్యాణానికి )

చిత్రం: సంసారం ఒక చదరంగం(1987)

రచన: వేటూరి

గానం: పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి  :

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

చరణం 1 :

కన్ను కన్ను కలవగనే ప్రణయం రాగం తీసెనులే పాదం పాదం కలపగనే హృదయం తాళం వేసెనులే ఒకటే మాట,ఒకటే బాణం ఒక పత్ని శ్రీరామ వ్రతం నాలో,నీలో రాగం తీసి వలపే పలకే త్యాగయ కీర్తనలెన్నో జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

చరణం 2:

జానకి మేను తాకగనే జళ్ళున వీణలు పొంగినవి జాణకు పూతలు పూయగనే జావళి అందెలు మ్రోగినవి ప్రేమే సత్యం ప్రేమే నిత్యం ప్రేమే లేదా మయ్యమతం నాలో నీలో నాత్యాలాడి లయలే చిలికే రమదాసు కృతులెన్నో జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

17, ఆగస్టు 2021, మంగళవారం

Samsaram Oka Chadarangam : Jagame Maya Song Lyrics (జగమే మాయ బ్రతుకే మాయ)

చిత్రం: సంసారం ఒక చదరంగం(1987)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 


జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా పాశమనే ఎదముళ్లు యమవాదమ్మ ఆశ పాశాలు మాసే వర్ణాలు కలగంటే ఖర్చు నీకేనమ్మా ఈ బాదేనమ్మా భార్యా పుత్రులనే వలలో పడకోయి కాసులకే నీ సుతుడు అంకితమోయి కాసులకే నీ సుతుడు అంకితమోయి నాది నాది అనే బంధం వలదోయి నీ గుటకే నిర్మాలానందమోయ్ నిమిషామానంద మోయ్ నీతులు చెబుతుంటే కూతురు వినదోయి తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్ తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్ కట్టే బట్టైన మాటే వినదోయి కాబట్టే మందు కొట్టేనోయి జో కొట్టేనోయి ఇల్లు వాకిలి పిల్ల మేకని బ్రమపడకు బ్రతుకంత నాటకమోయి శ్రమపడితే మిగిలేది బూటకమోయి బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ సంతేనోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా జగమే మాయ బ్రతుకే మాయ

30, జూన్ 2021, బుధవారం

Samsaram Oka Chadarangam : Samsaram Oka Chadarangam Song Lyrics (సంసారం ఒక చదరంగం...)

చిత్రం: సంసారం ఒక చదరంగం(1987)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 


సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు... ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. గుండెలే..బండగా..మారిపోయేటి స్వార్ధం తల్లినీ.. తాళినీ.. డబ్బుతో తూచు బేరం రక్తమే..నీరుగా.. తెల్లబోయేటి పంతం కంటికీ..మంటికీ..ఏకధారైన శోకం తలపై విధి గీత ఇల పైనే వెలసిందా? రాజులే బంటుగా మారు ఈ క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేళిలో ధనమే తల్లి.. ధనమే తండ్రి.. ధనమే దైవమా..!!?? సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం... స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు...ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కాలిలో..ముల్లుకీ..కంట నీరిచ్చు కన్ను కంటిలో..నలుసునీ..కంట కనిపెట్టు చెల్లీ! రేఖలు.. గీతలు..చూడదీ రక్తబంధం, ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం!! గదిలో ఇమిడేనా మది లోపల మమకారం?? పుణ్యమే..పాపమై..సాగు ఈ పోరులో, పాపకే పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. ప్రాణాలు తీసినా.. పాశాలు తీరునా... అదుపు లేదు.. ఆజ్ఞ లేదు..మమకారాలలో!! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కౌగిలే.. కాపురం.. కాదులే పిచ్చి తల్లీ, మల్లెల.. మంచమే.. మందిరం కాదు చెల్లీ, తేనెతో.. దాహము.. తీర్చదేనాడు పెళ్లి త్యాగమే.. ఊపిరై.. ఆడదయ్యేను తల్లి కామానికి దాసోహం.. కారాదే సంసారం! కాచుకో.. భర్తనే.. కంటి పాపాయిగా, నేర్చుకో.. ప్రేమనే.. చంటి పాపాయిగా, మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము.. ప్రేమే వేదాంతము వయసు కాదు.. వాంఛా కాదు.. మనసే జీవితం సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం చుక్కలు.. జాబిలి.. చూసి నవ్వేది కావ్యం నింగికే.. నిచ్చెన.. వేసుకుంటుంది బాల్యం తారపై.. కోరిక.. తప్పురా చిట్టి నేస్తం రెక్కలే.. రానిదే.. ఎగరనేలేదు భ్రమరం వినరా ఓ సుమతీ..పోరాదు ఉన్న మతి!! పాత పాఠాలనే దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా నిను పెంచేది.. గెలిపించేది.. చదువే నాయనా!! సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరు స్వప్నం ఈ గాలి వానలో..ఈ మేఘ మాలలో ఉరిమే మబ్బు.. మెరిసే బొమ్మ.. చెరిపే వేళలో సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరుస్వప్నం