13, జూన్ 2021, ఆదివారం

Dharma Kshetram : Are Inka Jinka Song Lyrics (అరె ఇంకా జంకా జింకా పెంకితనంగా)

చిత్రం: ధర్మ క్షేత్రం (1992)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా


పల్లవి: అరె ఇంకా జంకా జింకా పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫలంగా సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా అరె ఇంకా జంకా జింకా పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్నుపడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫలంగా చరణం:1 బంగారం పిచ్చుకా బాగోతం పెంచకా నా భాగం పంచేయంగా శృంగారం చిచ్చుగా కారం చూపించగా భండారం బయటేయంగా బాగుందా బొత్తిగా బలవంతం పెట్టగా బులపాటం చెలరేగంగా పంతాల పచ్చిగా పొలిమేరే తెంచగా పొంగుల్లో పొలమారంగా మరి చేస్తానే చెంగు అలా చిందేయంగా ఇదే సందంటూ చేతబడి చాల్లే యింకా మరీ స్వాతంత్రంగా మహా బాహాటంగా అలా జెండాలా ఎగరేయంగా అరరరె ఇంకా అరె ఇంకా జంకా జింకా పెంకితనంగా అదోవంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్నుపడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫలంగా సరే అంటావా సొంతోషంగా సగం ఇస్తావా సావాసంగా సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావంగా అల్లేయంగా అరె ఇంకా జంకా జింకా పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్నుపడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫలంగా చరణం:2 ఏకాంతం సాక్షిగా ఏమాత్రం దాచకా ఇస్తాగా నిక్షేపంగా ఆసాంతం వెచ్చగా ఆశంతా తీర్చగా వస్తాగా ప్రత్యేకంగా ఆ మాత్రం ఓర్చగా ఉండొద్దా ఓపికా ఆపొద్దే నిష్టూరంగా చెప్పిందే చెప్పకా వింటుందా దప్పిక చంపొద్దే చాదస్తంగా చమత్కారాలు కారాల విడ్డూరంగా అలా వారాలు వర్జ్యాలు వద్దే ఇంకా మరీ అంగా ఉంగా అనే గారాబంగా మొరాయిస్తావేం మోహనరంగా

అరరె ఇంకా ఎలా ఇంకా కల్లోలంగా కన్నుపడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫలంగా అరె ఇంకా జంకా జింకా పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా సరే అంటావా సొంతోషంగా సగం ఇస్తావా సావాసంగా అరె ఇంకా జంకా జింకా పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్నఫలంగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి