Telugu Cinema Saahityam (తెలుగు సినిమా సాహిత్యం)
తెలుగు చిత్ర గీతాల సామూహిక
5, జూన్ 2021, శనివారం
Egire Pavurama : Maagha Maasam Song Lyrics (మాఘమాసం ఎప్పుడొస్తుందో..)
చిత్రం: ఎగిరే పావురమా
సంగీతం: S.V.కృష్ణారెడ్డి
గానం: సునీత
సాహిత్యం: వేటూరి
మాఘమాసం ఎప్పుడొస్తుందో...
మౌనరాగాలెన్ని నాళ్లో...
మంచు మబ్బు కమ్ముకోస్తుందో
మత్తు మత్తు ఎన్నిఎళ్ళు
ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...
మాఘమాసం ఎప్పుడొస్తుందో...
మౌనరాగాలెన్ని నాళ్లో...
ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...
తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కుపచ్చలు ఆరలేదని ముసిరాడే నాతోడు
నా.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేత లేతగ సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా ….ఓ..ఆ...
హాయమ్మ వలపులే తొలి రేయమ్మ వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే...
మాఘమాసం ఎప్పుడొస్తుందో...
మౌనరాగాలెన్ని నాళ్లో...
ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...
తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు
నా... కంటి పాపకు కొంటె కళలను అలికాడే అతగాడు
వొంటి బ్రతుకున జంట సరిగమ పలికిన్చేదేనాడో
ఓయమ్మో…ఓ..ఆ...
వొల్లంత మనసులయ్యి తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే సుభలగ్నమేనాడో...
మాఘమాసం ఎప్పుడొస్తుందో...
మౌనరాగాలెన్ని నాళ్లో...
ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి