చిత్రం: దేవి (1999)
రచన: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి
మేలిమి బంగారు చీరలో మెరిసే ఓ వయ్యారి
నా మనసులోని మారాలి మల్లెల చిరుగాలి
నా ప్రేమ నీకు నివాళి నువ్వే నువ్వే కావాలి
చరణం 1 :
సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి
అంకెలకందని ఊసులే దాచారా విహరి
న వలపు నీకు సుమాలి యవ్వన వనమాలి
ఈ చంద్రకాంత చక్కోరి గుండెల్లోకి చేరాలి
కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి
సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి
చరణం 2:
మంచు కొండ అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం
ఈ తామర మొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం
హంస రెక్క పక్క ఆది తాళమేసి పలికెను ఆహ్వానం
ఈ అచట ముచ్చట ఇచట తీరగా హెచ్చెను హేమంతం
ప్రియమగు ప్రియురాలా చెంపకు విరహాల
విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగి ఊగి రేగే అందాలే వేసే పూ బంధాలే
మధురం మధురం సాగే సరాగం మనసా వాచా….
కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి
సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి
అక్షరాలా నీకు ఇచ్చి పుచ్చుకున్న వెచ్చని తాంబూలం
అది ముద్దుగా మారి బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం
ఎక్కు పెట్టి ఉన్న పంచదార విల్లు చేసింది ఈ గాయం
అది గుచ్చాక పోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం
నిలిచా నిను కోరి రసమయ రహదారి
శుభమే సుకుమారి సొగసుకి ప్రతి సారి
మదిలో యెదలో ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
నింగి నేల ఎల్ రాగాలే నీను నేనై
సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి
కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి
నా వలపు నీకు సుమాలి యవ్వన వనమాలి
నా ప్రేమ నీకు నివాళి నువ్వే నువ్వే కావాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి