చిత్రం: గాండీవం
సంగీతం: M.M.కీరవాణి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర,ఎం. జి. శ్రీకుమార్
సాహిత్యం: వేటూరి
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింట చిందులేసి
అందమైన బాలుడే తనవాడై(గోరువంక)
ఏటి మనుగడ కోటి అలలుగ
పొంగు వరదల వేగాన
పడిలేచు అలలకు తీపి కలలకు
లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిలా పడ్డట్టున్న
అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మ
అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపమవ్వాలంటా దిక్కుల్లో
ఎవరికి వారే... యమునకు మీరే...
రేపు మీద నావదంట
నావ తోడు రేవుదంట పంచుకుంటే(గోరువంక)
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన
తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన
పూల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఏరు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పోద్దుల్లో
పరవశమేదో ఓ... పరిమళమాయే.ఏ... ఓ...
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే(గోరువంక)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి