28, జూన్ 2021, సోమవారం

Devullu : Andari Bandhuvaya Bhadrachala Ramaiah Song Lyrics (అందరి బంధువయా భద్రాచల రామయ్యా)

చిత్రం: దేవుళ్ళు (2000)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్




రామా..... రామా....... అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీత రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీత రామయ్యా కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్య అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా రామా.... రామా... తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్యా తండ్రిమటకై పదవిని వదలి అడవులకేగేనయా మహిలో జనులను కవగావచ్చిన మహావిష్ణు అవతరమయా ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోసించెనయా అశురుని ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనడెనయా నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా.. ఆఆఆ.. నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహ్రుదయుడు శరణనువారికి అభయమోసుగునయ్యా అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామ మయం భక్తుడు భద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించేనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా పంచవాటిన ఆ జనకిరాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆఆఆ.. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన? జన్మ ధన్యమయ్యా... అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీత రామయ్యా కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్య అందరి బంధువయా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి