4, జూన్ 2021, శుక్రవారం

Geethanjali : O Papa Laali Song Lyrics (ఓ పాపా లాలి..జన్మకే లాలి..)

చిత్రం: గీతాంజలి (1989)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా


ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి..పాడనా తీయగా.. ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి పాడనా.. ఓ పాపా లాలి. నా జోలలా లీలగా తాకాలని.. గాలినే కోరనా జాలిగా.. నీ సవ్వడే సన్నగా ఉండాలని.. కోరనా గుండెనే కోరిక.. కలలారని పసిపాప..తలవాల్చిన ఒడిలో.. తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో.. చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి..పాడనా తీయగా.. ఓ పాపా లాలి.. ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి.. గాలిలో..తేలిపో..వెళ్ళిపో.. ఓ..కోయిల పాడవే నా పాటని.. తీయని తేనెలే చల్లిపో.. ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో.. సెలయేరుల అల పాటే వినిపించని గదిలో.. చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి.. ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి..పాడనా తీయగా.. ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి పాడనా.. ఓ పాపా లాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి