Geethanjali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Geethanjali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఏప్రిల్ 2022, ఆదివారం

Geethanjali : Amani Padave Song Lyrics (ఆమని పాడవే హాయిగా)

చిత్రం: గీతాంజలి (1989)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా 



ఆమని పాడవే హాయిగా..మూగవైపొకు ఈ వేళ.. రాలేటి పూల రాగాలతో..పూసేటి పూల గంధాలతో.. మంచు తాకి కోయిల..మౌనమైన వేళల.. ఆమని పాడవే హాయిగా.. ఆమని పాడవే హాయిగా.. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా.. మనస్సులో నిరాశలే..రచించెలే మరీచికా పదాల నా ఎద..స్వరాల సంపద తరాల నా కథ..క్షణాలదే కదా గతించిపోవు గాధలేననీ..! ఆమని పాడవే హాయిగా.. మూగవైపోకు ఈ వేళ.. రాలేటి పూల రాగాలతో.. సుఖాలతో పిఖాలతో..ధ్వనించినా మధూదయం దివి భువి..కలా నిజం..స్ప్రుశించినా మహోదయం.. మరో ప్రపంచమే..మరింత చేరువై నివాళి కోరిన..ఉగాది వేళలో గతించిపోవు గాధలేననీ..! ఆమని పాడవే హాయిగా..  ఆమని పాడవే హాయిగా..

Geethanjali : Om Namaha Song Lyrics (ఓం నమః నయన )

చిత్రం: గీతాంజలి (1989)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా


ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః అధర జాతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో.. ఈ మంచు బొమ్మలొకటై కలిసి కరిగే లీలలో రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిది..లోకము తోచగా.. కాలము లేనిది..గగనము అందగా.. సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం.. ఒంటరి బాటసారి జంటకు చేరరా కంటికి పాపవైతే రెప్పగ మారనా తూరుపు నీవుగా..వేకువ నేనుగా.. అల్లిక పాటగా పల్లవి ప్రేమగా.. ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే జగతికే అథిదులై జననమందిన ప్రేమ జంటకు ఓం..

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం

19, జూన్ 2021, శనివారం

Geethanjali : Jagada Jagada song lyrics (జగడ జగడ జగడం చేసేస్తాం)

చిత్రం: గీతాంజలి (1989)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా



జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం
ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం సయ్యంటే సయ్యాటలో హే హే మా వెనుకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢిఆటలో నేడేరా నీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా రానే రాదు ఏడేడు లోకాల తోన బంతాటలాడాలి ఈనాడే తక తకదిమి తకజణు
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం
పడనీరా విరిగి ఆకాశం విడిపోనీ భూమి ఈ క్షణం మా పాట సాగేనులే హో నడి రేయి సూర్యదర్శనం రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే ఓ మాట ఒక్క బాణము మా సిద్దాంతం పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూసాక ఈనాడే తక తకదిమి తకజణు
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే
రంపంపంపం జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం తకిట తకిట తకిదిమితక తకిట తకిట తకిదిమితక తకిట తం తం తం


Geethanjali : Jallantha Thullantha song lyrics (జల్లంత కవ్వింత కావలి లే)

చిత్రం: గీతాంజలి (1989)

సాహిత్యం: వేటూరి

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా



జల్లంత కవ్వింత కావలి లే ఒళ్ళంత తుళ్ళింత రావలిలే.. (2) ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చింది లే ఎండల్లో వెన్నెల్లు తెచ్చింది లే (2) వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా.. గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా.. మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు బొండుమల్లె తేనేనొక్క ముద్దులాడి వెళ్ళదాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి.. (జల్లంత) సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా.. తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా.. వాన దేవుడే కళ్ళాపి జల్లగా వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో ఓహో.. (జల్లంత)


Geethanjali : Nandikonda Vaagullona song lyrics (నంది కోండ వాగుల్లోన)

చిత్రం: గీతాంజలి (1989)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా


ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. నంది కోండ వాగుల్లోన,నల్ల తుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లోన,సందే పొద్దు సీకట్లొ నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా.. నా ఊరేది...ఏది నా పేరేది...ఏది నా దారేది...ఏది నా వారేరి..ఇ..హ హ ఓ..ఓ..ఓ..ఓ..ఓ...ఓ..ఓ.. ఎనాడో ఆరింది నా వెలుగు..నీ దరికే నా పరుగు.. ఆనాడే కోరాను నీ మనసు..నీ వరమే నన్నడుగూ.. మొహిని పిసాచి నా చెలిలే..శాకిని విషూచి నా సఖిలే.. మొహిని పిసాచి నా చెలిలే..శాకిని విషూచి నా సఖిలే.. విడవకురా..వదలనురా..ప్రేమేరా నీ మీదా... నంది కోండ వాగుల్లోన,నల్ల తుమ్మ నీడల్లో భూత ప్రేత పిసాచ భేతాల మారె ఢం ఢం..జడం భం భం నంది కోండ వాగుల్లోన,నల్ల తుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లోన,సందే పొద్దు సీకట్లొ నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా.. నీ కబళం పడతా..నిను కట్టుకు పోతా నీ భరతం పడతా..నిను పట్టుకు పోతా ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. డాకిని డక్క ముక్కల చెక్క డంభొ తినిపిస్తాన్.. తాటకి కనిపిస్తే..తాటలు వలిచేస్తాన్.. గుంటరి నక్క డొక్కలొ చొక్క అంభో అనిపిస్తాన్.. నక్కను తొక్కిస్తాన్..చుక్కలు తగ్గిస్తాన్.. రక్కసి మట్టా తొక్కిస గుట్ట పంబే దులిపెస్తాన్.. తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్.. రక్కసి మట్టా తొక్కిస గుట్ట పంబే దులిపెస్తాన్.. తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్.. వస్తాయ ఫట్..ఫట్..వస్తాయ ఝట్..ఝట్.. కోపాల మసజస తతగా..సార్దూలా నంది కోండ వాగుల్లోన,నల్ల తుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లోన,సందే పొద్దు సీకట్లొ నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా.. నీ కబళం పడతా..నిను కట్టుకు పోతా నీ భరతం పడతా..నిను పట్టుకు పోతా ఏ..ఏ..ఏ..ఏ..ఏ.. ఏ..ఏ..ఏ..ఏ..ఏ.. నంది కోండ వాగుల్లోన,నల్ల తుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లోన,సందే పొద్దు సీకట్లొ..

4, జూన్ 2021, శుక్రవారం

Geethanjali : O Priya Priya Song Lyrics (ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా)

చిత్రం: గీతాంజలి (1989)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా



ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలు రాలు పూల దండలు  నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె  నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే ఓ ప్రియా ప్రియా||  నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలి లాగ మారదు ప్రేమ సత్యము  రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో  ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు  సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా||  కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి  నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే  వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన  లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం ఓ ప్రియా ప్రియా||