26, జూన్ 2021, శనివారం

Gharana Bullodu : Bhimavaram Bulloda Song Lyrics (భీమవరం బుల్లోడా పాలు కావాలా)

చిత్రం: ఘరానా బుల్లోడు(1995)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,సింధూజ


పల్లవి:


భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా..

(జింక చికుం జింక చికుం)

నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కెర చుమ్మ

పచ్చి పాల మీగడ (జింక చికుం జింక చికుం)

అచ్చ తెలుగు ఆవడ (జింక చికుం జింక చికుం)

పెదవుల్లోనే దాచవమ్మో... ఓ (జింక చికుం జింక చికుం)

భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా


సగసాని పానిస నీసగమ


చరణం1:

మావుళ్ళమ్మ జాతరలో (జింక చికుం జింక చికుం)

కౌగిళ్ళమ్మ centre లో (జింక చికుం జింక చికుం)

ఒళ్ళోకొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళు చేసి నీ కోసమే ఎదురు చూస్తి మావో

జారే పైట junction లో (జింక చికుం జింక చికుం)

జోరే ఎక్కు tension లో (జింక చికుం జింక చికుం)

కారా కిళ్ళీలాంటి కిస్సు ఆరారా పెట్టమంటు నోరార అడిగినాను పిల్లో

కుర్రోడి కొరుకుళ్ళకి ఎదే వెర్రెక్కిపోతుంది పాడు

కుర్రీడు చిరుతిళ్ళకి ఏదో వెర్రెక్కిపోతుంది చూడు

అందుకో బాసు ఆ టీను ఆసు... ఓ (జింక చికుం జింక చికుం)


భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా

(జింక చికుం జింక చికుం)

నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కెర చుమ్మ


చరణం2:


తాపాలమ్మ సావిట్లో (జింక చికుం జింక చికుం)

దాహలమ్మ సందిట్లో (జింక చికుం జింక చికుం)

రేపు మాపు నీతోనే లంగరేసుకుందామని చెంగు చాటుకొచ్చిన్నాను పిల్లోయ్

మోహపూరం station లో (జింక చికుం జింక చికుం)

ముద్దాపూరం బస్సెక్కి (జింక చికుం జింక చికుం)

చెక్కిలిపల్లి చేరాలని అక్కరతో వచ్చినావు అందుకనే నచ్చినావు మావో

వరసైన దోరసానికి ఇక కరుసేలే ఇరుసంత రోజు

దరువేసే దొరబాబుకి ఈ పరువాల బరువెంత మోజు

వయ్యారి జాణ ఒళ్ళోకి రానా... ఓ (జింక చికుం జింక చికుం)



భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా

(జింక చికుం జింక చికుం)

నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కెర చుమ్మ

పచ్చి పాల మీగడ (జింక చికుం జింక చికుం)

అచ్చ తెలుగు ఆవడ (జింక చికుం జింక చికుం)

పెదవుల్లోనే దాచవమ్మో... ఓ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి