చిత్రం: నిన్నే ప్రేమిస్తా
సంగీతం: S.A.రాజ్ కుమార్
గానం: రాజేష్ కృష్ణన్ , చిత్ర
సాహిత్యం: ఘంటాడి కృష్ణ
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ఆ దేవుని పూజకు నువ్వొస్తే ఆ దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం... గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట... నా చిరునవ్వయి నువ్వే ఉండాలి... ఉండాలి నా కనుపాపకు రెప్పయి ఉండాలి... ఉండాలి చెలి గుండెలపై నిద్దుర పోవాలి... పోవాలి ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి... ఎదగాలి నా చెలి అందెల సవ్వడి నేనై నా చెలి చూపుల వెన్నెల నేనై చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి... పోయాలి నెచ్చెలి పవిటికి చెంగును కావాలి... కావాలి కావాలి కమ్మని కలలకు రంగులు పూయాలి... పూయాలి నా చిరునామా నువ్వే కావాలి... కావాలి కావాలి తుమ్మెద నంటని తేనెవు నువ్వయి కమ్మని కోకిల పాటవు నువ్వయి చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి వెలుగులు పంచాలి వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి