Ninne Premistha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ninne Premistha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

Ninne Premistha : Koila Paata Bagunda Song Lyrics (కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా)

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అందమైన మల్లె మాల బాగుందా అల్లి బిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అప్పుడిప్పుడు గున్నమామి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా నిదురించిన ఎద నదిలో అల లెగిసిన అలజడిగా తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గచుక్కలాగా ఉన్న తారక కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా కలలుకనే కన్నులలో కునుకెరుగని కలవరమా రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది అందమైన మల్లె మాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది

12, జులై 2021, సోమవారం

Ninne Premistha : Prema Endukani Song Lyrics (ప్రేమా ఎందుకని)

చిత్రం: నిన్నే ప్రేమిస్తా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం:  రాజేష్, చిత్ర

సాహిత్యం: E.S.మూర్తి


ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు

కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు

ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం

ఇపుడే అది కానుంది తీయని బంధం

శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు

కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు


పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు 

హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు

వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు 

చీకటి చెరిగేలా ఆ కంటి చూపు

వేకువ జామున వాకిట వెలిసే వన్నెల వాసంతం

ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే నా చెలి మందారం

ఎంత చేరువై వుంటే అంత సంబరం

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు

కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు



ఏటిలో తరగల్లే ఆగనంటుంది 

ఎదురుగా నేనుంటే మూగబోతోంది

కంటికి కునుకంటూ రాను పొమ్మంది 

మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది

ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం

అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం

వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవం



ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు

కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు

ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం

ఇపుడే అది కానుంది తీయని బంధం

శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు

కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు



6, జూన్ 2021, ఆదివారం

Ninne Premistha : Gudi Gantalu Song Lyrics (గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది)

 చిత్రం: నిన్నే ప్రేమిస్తా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం: రాజేష్ కృష్ణన్ , చిత్ర

సాహిత్యం: ఘంటాడి కృష్ణ


గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ఆ దేవుని పూజకు నువ్వొస్తే ఆ దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం... గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట... నా చిరునవ్వయి నువ్వే ఉండాలి... ఉండాలి నా కనుపాపకు రెప్పయి ఉండాలి... ఉండాలి చెలి గుండెలపై నిద్దుర పోవాలి... పోవాలి ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి... ఎదగాలి నా చెలి అందెల సవ్వడి నేనై నా చెలి చూపుల వెన్నెల నేనై చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి... పోయాలి నెచ్చెలి పవిటికి చెంగును కావాలి... కావాలి కావాలి కమ్మని కలలకు రంగులు పూయాలి... పూయాలి నా చిరునామా నువ్వే కావాలి... కావాలి కావాలి తుమ్మెద నంటని తేనెవు నువ్వయి కమ్మని కోకిల పాటవు నువ్వయి చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి వెలుగులు పంచాలి వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి...

Ninne Premistha : Oka Devatha Velasindi (Female) Song Lyircs (ఒక దేవత వెలసింది నీ కోసమే)

చిత్రం: నిన్నే ప్రేమిస్తా

సంగీతం: S.A.రాజ్ కుమార్

గానం: చిత్ర

సాహిత్యం: DR.వెనిగళ్ల రాంబాబు 


పల్లవి : ఒక దేవత వెలసింది నీ కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ఒక దేవత వెలసింది నీ కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తానని...॥దేవత॥ చరణం : 1 విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోన నీ నీడే చూశానమ్మా ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా నీ నవ్వే నా మదిలో అమృతవర్షం ఒదిగింది నీలోనే అందని స్వర్గం నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి మును ముందుకు వచ్చే నెచ్చెలినే చూసి అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని ॥దేవత॥ చరణం : 2 రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగ పోసి పూయించా నీ జడకోసం రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించా నీ జతకోసం నీరెండకు నీ వెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా ఇన్నాళ్లూ అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని ॥దేవత॥