చిత్రం: కలుసుకోవాలని (2002)
రచన: దేవి శ్రీ ప్రసాద్
గానం: సుమంగళి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే
భూలోకం నను నిద్దర పుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతొ నను నిద్దుర లేపి
రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి
అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి
అవి లోకం లోన చీకటినంతా తరిమెయ్యాలి
ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే
భూలోకం నను నిద్దర పుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతొ నను నిద్దుర లేపి
రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి
ఇంధ్రధనస్సుని ఊయలగా నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావాలి
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కల్లాపే చల్లాలి
ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి
ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే
భూలోకం నను నిద్దర పుచ్చాలి.. హొయ్
నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి
నాతోనుంటు ఎన్నడైనా సరే పసిపాపల్లే నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరుముద్దలు పెట్టాలి
ప్రేమలోన ఉన్న తియ్యదనం ప్రేమతోటి తెలిపి
చిన్న తప్పు చేస్తే నను తియ్యగ తిట్టాలి
ఏనాడు నా నీడై ఉండాలి
ఆ నీడని చూసి ఓటమిలన్ని పారిపోవాలి
హే.. ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే
భూలోకం నను నిద్దర పుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతొ నను నిద్దుర లేపి
రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి