Kalusukovalani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kalusukovalani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఫిబ్రవరి 2024, సోమవారం

Kalusukovalani : Priya Priya Song Lyrics (ప్రియా ప్రియా అంటూ నా మది)

చిత్రం: కలుసుకోవాలని (2002)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: దేవి శ్రీ ప్రసాద్, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది

దహించు ఏకాంతమే సహించలేనన్నది

యుగాల ఈ దూరమే భరించలేనన్నది విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది.

కన్నీళ్ళలో ఎలా ఈదను నువే చెప్పు ఎదురవని నా తీరమా నిట్టూర్పుతో ఎలా వేగను నిజం కాని నా స్వప్నమా హా ఎలా దాటాలి ఈ ఎడారిని ఎలా చేరాలి నా ఉగాదిని క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది

24, నవంబర్ 2021, బుధవారం

Kalusukovalani : Udayinchina Suryudini Song Lyrics (ఉదయించిన సూర్యుడినడిగా)

చిత్రం: కలుసుకోవాలని (2002)

రచన: దేవి శ్రీ ప్రసాద్

గానం: దేవి శ్రీ ప్రసాద్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే హే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీకోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం నీ జాడ తెలిసిన నిమిషం, అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే హోయ్' ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని నువ్వు లేక చిరుగాలి, నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది కాస్త దూరమే కాదా, మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని హోయ్' నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే హే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి 

ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే 

27, జూన్ 2021, ఆదివారం

Kalusukovalani : Akasam Song Lyrics (ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే)

చిత్రం: కలుసుకోవాలని (2002)

రచన: దేవి శ్రీ ప్రసాద్

గానం: సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే

భూలోకం నను నిద్దర పుచ్చాలి

జాబిల్లి తన వెన్నెలతొ నను నిద్దుర లేపి

రేయంతా తెగ అల్లరి చెయ్యాలి

ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి

అవి రేపో మాపో నిజమవ్వాలి

గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి

అవి లోకం లోన చీకటినంతా తరిమెయ్యాలి

ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే

భూలోకం నను నిద్దర పుచ్చాలి

జాబిల్లి తన వెన్నెలతొ నను నిద్దుర లేపి

రేయంతా తెగ అల్లరి చెయ్యాలి


ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి

ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి

ఇంధ్రధనస్సుని ఊయలగా నేను మలచాలి

తారలన్ని నాకు హారము కావాలి

మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి

చందమామ నాకు చందనమవ్వాలి

రంగులతో కల్లాపే చల్లాలి

ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి

ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే

భూలోకం నను నిద్దర పుచ్చాలి.. హొయ్


నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి

నాతోనుంటు ఎన్నడైనా సరే పసిపాపల్లే నను చూసుకోవాలి

అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి

నాకు ముద్దు ముద్దు గోరుముద్దలు పెట్టాలి

ప్రేమలోన ఉన్న తియ్యదనం ప్రేమతోటి తెలిపి

చిన్న తప్పు చేస్తే నను తియ్యగ తిట్టాలి

ఏనాడు నా నీడై ఉండాలి

ఆ నీడని చూసి ఓటమిలన్ని పారిపోవాలి

హే.. ఆకాశం తన రెక్కలతొ నను కప్పుతు ఉంటే

భూలోకం నను నిద్దర పుచ్చాలి

జాబిల్లి తన వెన్నెలతొ నను నిద్దుర లేపి

రేయంతా తెగ అల్లరి చెయ్యాలి