చిత్రం: ఖైదీ(1983)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
గోరింట పూసింది
గోరింక కూసింది
గొడవేమిటే రామ చిలకా
గొడవేమిటే రామ చిలకా
నే తీర్చనా తీపి అలకా
నే తీర్చనా తీపి అలకా
గోరింక వలచింది
గోరింట పండింది
కోరిందిలే రామ చిలక
కోరిందిలే రామ చిలక
నీ ముద్దు నా ముక్కు పుడక
నీ ముద్దు నా ముక్కు పుడక
ఏలో ఏలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో ఏలో
చరణం 1:
పొగడాకు తేనేంతో పొదరిల్లు కడిగేసినా
రతనాల రంగులతో రంగ వల్లులు తీర్చి
ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే
సొదలేమిటే రామచిలక
సొదలేమిటే రామచిలక
సొగసిచ్చుకో సిగ్గు పడక
సొగసిచ్చుకో సిగ్గు పడక
గోరింక వలచింది
గోరింక పండింది
చరణం 2:
విరజాజి రేకులతో విరిసేయ సవరించి పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి నిదరంతా మింగేసే నిశిరాతిరి తోడుంటే కొదవేమిటే గోరువంక కొదవేమిటే గోరువంక కడకొంగుతో కట్టుపడక కడకొంగుతో కట్టుపడక గోరింట పూసింది గోరింక కూసింది కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక నే తీర్చనా తీపి అలకా నే తీర్చనా తీపి అలకా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి