27, జూన్ 2021, ఆదివారం

Kondaveeti Donga : Chamaku Chamaku Song Lyircs (అరె చమకు చమకు చాం)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్.చిత్ర


పల్లవి:

అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్ 
అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
హే.. చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా

చరణం 1:

నాగ స్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
తాచు పొగరుతో రేగిందయ్యా
కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ
సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు
ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
కథ ముదరగా
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
అయ్యారే తస్సాదియ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
వయ్యారం సయ్యందయ్యా
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం

చరణం 2:

అగ్గి జల్లులా కురిసే వయసే
నెగ్గలేకపోతున్నా
ఈతముల్లులా యదలో దిగెరో
జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా
తియ్యని గాయం మాయం చేసే
మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో
ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా
పదపదమని
చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
అహ....చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
అహ...చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి