Kondaveeti Donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kondaveeti Donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2025, సోమవారం

Kondaveeti Donga : Tippu Top Look Song Lyrics (హా టిప్పు టాపు లుక్కు)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి:
హు... హా... హే...
హా టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే
రప ప ప ప
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
చరణం 1:
చం చం చంచం
చం చం చంచంచంచంచం
చం చం చంచం
చం చం చంచంచంచంచం వేళ లేని పాళ లేని వెర్రిలో
వేడి బుగ్గలంటుకుంటే వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో
పాల ఈడు పాయసాల కోరికా
సమ్మర్ ఇంటి సాల్టు సందెవేళ బోల్టు
అందమైన స్టార్టు ఆకశాన హల్టు
సొమ్ములప్పుచేసి సోకు చూసుకోనా
సొంతమైన దిచ్చేసి సోమసిల్లి పోనా
షేకు నిన్ను చేసేసి షాక్ చూసుకోనా
బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా
తడి సరకుల ఒడి దూడుకుల
ముడి సరకుల ముడి విడుపులలో హొ...
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ...
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
చరణం 2:
చం చచంచం చం చచంచం చం చచంచంచం...
చం చచంచం చం చచంచం చంచంచచంచచంచచం... మత్తు మత్తు ఊగులాట మధ్యలో
ఎత్తుకున్న పాటకేది పల్లవీ
కొత్త కొత్త కొంగులాట మధ్యలో
మోత్తుకున్నమోజులన్ని పిల్లవీ
పైన కోకోనట్టు లోన చాకిలెట్టు
ఈడు స్పీడ్ జెట్టు ల్యాండ్ కాదు ఒట్టు
కన్నుమాటలన్నేసి నిన్ను కమ్ముకోనా
ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా
చెంప చేతికిచ్చేసి చేమగిల్లి పోనా
తేనే పట్టు ఒగ్గేసి తెప్పెరిల్లి పోనా
కచటతపల కసి వయసుల గచట ఎప్పుడు
చలి ముడి పడునో హొ...
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ..
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే
దాదదూదు దీదిదాద...
టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
హే రపపాపపప రపపాపపప
రంపపాప రంపపాపపా

Kondaveeti Donga : Devi Shambhavi Song Lyrics (దేవి శాంభవి దీన బాంధవి)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్.జానకి



పల్లవి:
దేవి శాంభవి దీన బాంధవి
పాహి పార్వతి కృపా సరస్వతి
దేవి శాంభవి దీన బాంధవి
పాహి పార్వతి కృపా సరస్వతి
లోక బాంధవి ప్రాణ దాతవి
శోక గాధవి కాపాడు శాంభవి
అశ్రుధారతో నీ కాళ్ళు కడగామా
రక్త గంగతో పారాణి దిద్దమా
దేవుడంటి మా ప్రభువు కోసము నీవు కోరితే మా ప్రాణమివ్వమా
శ్రీ దుర్గ కనక దుర్గ కొండ దేవతా
కొంగుపట్టి అడిగినాము నీ సాహతా...



7, ఏప్రిల్ 2022, గురువారం

Kondaveeti Donga : Sri Anjaneyam Prasannajeneyam Song Lyrics (శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి : 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం

చరణం 1:

రామ అంటే నీకు ప్రేమ భామ అంటే నాకు ప్రేమ ప్రేమ భిక్ష నాకు పెట్టరా
ఆకు పూజ నీకు నోము సోకుపూజ నాకు నోము జంటకింక గంట కొట్టగా
ముద్దులేక ముచ్చటాడు పొద్దులేక పొందులేక ముక్కు
మోజు పడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా
జివ్వు మన్న ఒంట్లో చివుక్కు మంది ప్రాణం ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన
మూసుకున్న నాకు దిక్కు చూపరా మొహనాలు మోయలేక సోయగాలు దాయలేక
జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం

చరణం 2:

కోడె గాలి కొట్టగానే కొంగు జారి కొంప తీసి ఒంపు సోంపు గంప కెక్కెరా
ఆడగాలి సోకగానే కచ్చె పుట్టి రెచ్చగొట్టి కన్నెనీడ కౌగిలించరా
పూటకొక్క పువ్వు పెట్టి పూల బాణమేసికొట్టు మన్మధున్ని ఆపలేనిమత్తు పుట్టెరా
మాపటేల మల్లెలెట్టి చీకటేల చిచ్చుబెట్టు పిల్లదాన్ని చూడగానే పిచ్చె పట్టెరా
పెట్టలేదు కామా ఇదేమి ప్రేమ గీతం
చెప్పలేను రామ మదీయ మౌన భావం
మంత్ర పుష్పం మనస్సు మదించు వేళలోన

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం

27, జూన్ 2021, ఆదివారం

Kondaveeti Donga : Chamaku Chamaku Song Lyircs (అరె చమకు చమకు చాం)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్.చిత్ర


పల్లవి:

అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్ 
అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
హే.. చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా

చరణం 1:

నాగ స్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
తాచు పొగరుతో రేగిందయ్యా
కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ
సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు
ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
కథ ముదరగా
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
అయ్యారే తస్సాదియ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
వయ్యారం సయ్యందయ్యా
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం

చరణం 2:

అగ్గి జల్లులా కురిసే వయసే
నెగ్గలేకపోతున్నా
ఈతముల్లులా యదలో దిగెరో
జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా
తియ్యని గాయం మాయం చేసే
మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో
ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా
పదపదమని
చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
అహ....చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్
అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
ఛాన్సు దొరికెరో హొయ్యా
అహ...చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపే దరువులే వెయ్యా

Kondaveeti Donga : Kola Kolamma Song Lyrics (కోలో కోలమ్మ)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


పల్లవి : 

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా

చరణం 1:
కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసేలే
కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరేలే
సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ
చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ
కుదేసాక అందాలన్ని కుదేలైన వేళల్లో
పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో
సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే
తణక్కు దిన
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా

చరణం 2:
మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే
కోత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే
కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు కళ్ళెమేసాను కమ్ముకో నన్ను కుదురుగా
భరోసాల వీరా రారా...భరిస్తాను నీ సత్తా
శృతేమించు శృంగారంలో...రతే నీకు మేనత్తా
ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు...హద్దులే లేవులే...
తణక్కు దిన
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా

7, జూన్ 2021, సోమవారం

Kondaveeti Donga : Jeevithame Oka Aata Song Lyrics (జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం


పల్లవి: 

జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా

చరణం 1:

అనాధ జీవులా...ఆ ఆ ఆ...ఉగాది కోసం...ఊ ఊ ఊ అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా గుడెసె గుడెసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా అనాది జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా గుడెసె గుడెసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా బూర్జువాళ్ళకూ భూస్వాములకూ... బూర్జువాళ్ళకూ భూస్వాములకూ బూజు దులపకా తప్పదురా తప్పదురా... తప్పదురా... తప్పదురా... జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా

చరణం 2: న్యాయ దేవతకూ...ఊ ఊ ఊ...కన్నులు తెరిచే...ఏ ఏ ఏ... న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా దోపిడి రాజ్యం... దొంగ ప్రభుత్వం... దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చకా తప్పదురా తప్పదురా... తప్పదురా... తప్పదురా... జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా