చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: మనో , ఎస్.జానకి
జివ్వుమని కొండగాలి..కత్తిలా గుచ్చుతోంది వెచ్చని కోరిక రగిలిందిలే !! నీవే నా ప్రేయసివే.. నీకేలే అందుకో ప్రేమగీతం కస్సుమని పిల్లగాలి.. నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే !! నీవే నా ప్రేమవులే.. నీకేలే అందుకో ప్రేమగీతం జివ్వుమని కొండగాలి..కత్తిలా గుచ్చుతోంది !! *ఒంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది (2) కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావు కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావు నేనే నిను కోరి చేరి వాలిపోవాలి !! కస్సుమని పిల్లగాలి.. నిప్పులా అంటుతోంది !! *మంచల్లే కరగాలి మురిపాలు సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు (2) కొమ్మల్లో పూలన్ని పానుపుగా మనముందుంచె పూలగాలి పూవుల్లో దాగున్న అందాలనే మనముందుంచె గంధాలుగా నేనే నిను కోరి చేరి వాలిపోవాలి !! జివ్వుమని కొండగాలి..కత్తిలా గుచ్చుతోంది ! కస్సుమని పిల్లగాలి.. నిప్పులా అంటుతోంది !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి