చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే.. రాజుకుంటే పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు పైన చూడ పొగరు.. లోన చూడ వగరు పిల్ల కాదు పిడుగు.. గుండె కోసి అడుగు దాచలేని ఉడుకు.. దోచుకోని సరుకు అందమైన ఆడపిల్ల పట్టుకుంటే చూడలేక చందమామ తప్పుకుంటే అందమైన ఆడపిల్ల.. చూడలేక చందమామ పట్టుకుంటే తప్పుకుంటే పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో