23, జూన్ 2021, బుధవారం

Manasantha Nuvve : Cheppana Prema Song Lyrics (చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా)

 చిత్రం : మనసంతా నువ్వే

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:R.P.పట్నాయక్, ఉష



చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. మనసంతా నువ్వే..మనసంతా నువ్వే.. మనసంతా నువ్వే..నా మనసంతా నువ్వే.. ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి.. గాలిలో పరిమళం నాకు చెబుతున్నది.. ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి.. గాలిలో పరిమళం నాకు చెబుతున్నది.. ఎపుడో ఒకనాటి నిన్నని .. వెతికానని ఎవరు నవ్వనీ.. ఇపుడు నిను చూపగలనని .. ఇదుగో నా నీడ నువ్వని.. నేస్తమా నీకు తెలిసేదెలా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని.. గుండెలో ఊసులే నీకు చెప్పాలని.. ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని.. గుండెలో ఊసులే నీకు చెప్పాలని.. నీ తలపులు చినుకు చినుకుగా ... దాచిన బరువెంత పెరిగెనో.. నిను చేరే వరకు ఎక్కడా .. కరిగించను కంటి నీరుగా.. స్నేహమా నీకు తెలిపేదెలా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. మనసంతా నువ్వే..మనసంతా నువ్వే.. మనసంతా నువ్వే..నా మనసంతా నువ్వే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి