Manasantha Nuvve లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Manasantha Nuvve లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2025, బుధవారం

Manasantha Nuvve : Akasana Egire Maina Song Lyrics (ఆకాశాన ఎగిరేమైనా )

చిత్రం: మనసంతా నువ్వే (2002)

సంగీతం : ఆర్.పీ.పట్నాయక్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.కె., సుజాత



పల్లవి:

ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా

అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా

పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోన

ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా


చరణం 1:

అటు ఇటు తిరుగుతూ కన్నులు

చిలిపి కలలను వెతుకుతూ ఉన్నవి

మదిని ఊరించు ఆశని కలుసుకోవాలనో

మధుర భావాల ఊసుని తెలుసుకోవాలనో

ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా


చరణం 2:

తడబడు తలపుల అల్లరి

ముదిరి మనసును తరుముతూ ఉన్నది

అలలుగా తేలి నింగిని పలకరించేందుకో

అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో


ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా

అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా

పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోన

ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా





29, అక్టోబర్ 2022, శనివారం

Manasantha Nuvve : Tuneega Tuneega Song Lyrics (తూనీగ తూనీగ ఎందాకా)

చిత్రం : మనసంతా నువ్వే (2002)

సంగీతం : ఆర్.పీ.పట్నాయక్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఉష, సంజీవని


తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా దూరంగా పోనీక ఉంటగా నీ వెనకాలే  రానీ సాయంగా ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా ఇంకానా చాలింకా... ఇంతేగా నీ రెక్కా ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతాకోక చిలకలుగా వామ్మొ బాగుందె ఇట్టా నాకూ నేర్పిస్తె చక్కా సూర్యుడ్నె కరిగిస్తాగా చినుకులుగా సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపొయ్యాడుగా తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగొచ్చె దారిని యెపుడూ మరిచిపోవెలా

6, జులై 2021, మంగళవారం

Manasantha Nuvve : Cheppave Prema Song Lyrics (చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా)

చిత్రం : మనసంతా నువ్వే

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.చరణ్, సుజాత


చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే

మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

హే హే హే...హే హే హే...హే హే హే హే...


వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని

పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని

దూరమే చెప్పదే నీ రూపు మారిందని

స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని

ఇకపై మన కౌగిళింతకి చలి చీకటి కంటపడదని

ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని

కొత్తగా తెలుసుకున్నాననీ...


చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా


రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా

ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా

పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక

దిక్కులే వెదుకుతూ వెతికావులే వింతగా

ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని

ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని

విరహమే తెలుసుకోవాలని...


చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే

మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

హే హే హే...హే హే హే...హే హే హే హే...


2, జులై 2021, శుక్రవారం

Manasantha Nuvve : Evvarineppudu Thana Valalo Song Lyrics (ఎవ్వరి నెప్పుడు తన వలలో)

చిత్రం : మనసంతా నువ్వే

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: K.K


ఎవ్వరి నెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ

ఆ మదినేప్పిడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ

అర్తం కానీ పుస్తకమే ిన కానీ ఈ ప్రేమ

జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ


ఇంతక ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ

ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ

కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ

కలిసిన వెంటనే ఏమవునో చెపాడు పాపం ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ


Manasantha Nuvve : Kita Kita Thalupulu Song Lyrics (కిట కిట తలుపులు )

 చిత్రం : మనసంతా నువ్వే

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: చిత్ర


కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.

రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా.

ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.


నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక.

కమ్మని కలలో అయినా నిను చూడలేదే.

నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా.

రెప్పపాటైనా లేక చూడాలనుందే.

నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా.

కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా.

ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.


కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు.

చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా.

చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి.

అమృతం అయిపోలేదా ఆవేదనంతా.

ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా.

ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా.

ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.

రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా.

ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.

ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.

ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.


23, జూన్ 2021, బుధవారం

Manasantha Nuvve : Nee Sneham Song Lyrics (నీ స్నేహం ఇక రాను అని)

 

చిత్రం : మనసంతా నువ్వే

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:R.P.పట్నాయక్



నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నువ్వు రాకు అని నను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

Manasantha Nuvve : Cheppana Prema Song Lyrics (చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా)

 చిత్రం : మనసంతా నువ్వే

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:R.P.పట్నాయక్, ఉష



చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. మనసంతా నువ్వే..మనసంతా నువ్వే.. మనసంతా నువ్వే..నా మనసంతా నువ్వే.. ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి.. గాలిలో పరిమళం నాకు చెబుతున్నది.. ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి.. గాలిలో పరిమళం నాకు చెబుతున్నది.. ఎపుడో ఒకనాటి నిన్నని .. వెతికానని ఎవరు నవ్వనీ.. ఇపుడు నిను చూపగలనని .. ఇదుగో నా నీడ నువ్వని.. నేస్తమా నీకు తెలిసేదెలా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని.. గుండెలో ఊసులే నీకు చెప్పాలని.. ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని.. గుండెలో ఊసులే నీకు చెప్పాలని.. నీ తలపులు చినుకు చినుకుగా ... దాచిన బరువెంత పెరిగెనో.. నిను చేరే వరకు ఎక్కడా .. కరిగించను కంటి నీరుగా.. స్నేహమా నీకు తెలిపేదెలా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.. మనసంతా నువ్వే..మనసంతా నువ్వే.. మనసంతా నువ్వే..నా మనసంతా నువ్వే..