19, జూన్ 2021, శనివారం

Nari Nari Naduma Murari : Manasuloni Maramamunu song lyrics (మనసులోని మర్మమును తెలుసుకో)

చిత్రం : నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం: కె. వి. మహదేవన్

గీత రచయిత: ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



పల్లవి:


మనసులోని మర్మమును తెలుసుకో

నా మనసులోని మర్మమును తెలుసుకో...

మాన రక్షకా మరకతాంగ

మాన రక్షకా మరకతాంగ


నా మనసులోని మర్మమును తెలుసుకో

నా మనసులోని మర్మమును తెలుసుకో...

మదనకీలగ మరిగిపోక

మదనకీలగ మరిగిపోక

నా మనసులోని మర్మమును తెలుసుకో


చరణం:1


ఇనకులాప్త నీవే గాని వేరెవరు లేరు

దిక్కెవరు లేరు ఆనంద హృదయా

మనసులోని మర్మమును తెలుసుకో

అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా

ఆ”కాంక్ష” తగున రాకేందు వదనా


మనసులోని మర్మమును తెలుసుకో


చరణం:2


మునుపు ప్రేమ గల దొరవై

సదా తనువు నేలినది గొప్ప కాదయా

మదని ప్రేమకథ మొదలై

ఇలా అదుపు దాటినది ఆదుకోవయా

కనికరమ్ముతో ఈవేళ ఊహూహు.....

కనికరమ్ముతో ఈవేళ నా కరముబట్టు హా......

త్యాగరాజ వినుతా


మనసులోని మర్మమును తెలుసుకో

నా మనసులోని మర్మమును తెలుసుకో


చరణం:3


మరుల వెల్లువల వడినై

ఇలా దరులు  దాటితిని నిన్ను చేరగా...

మసక వెన్నెలలు ఎదురై

ఇలా తెగువ కూడదని మందలించవా

కలత ఎందుకిక ఈ వేళ ఆ ఆ ఆ.....

కలవరమ్ముతో ఈవేళ నా కరము వణికే ఆ ఆ

ఆగడాల వనితా


మనసులోని మర్మమును తెలుసుకో

మదనకీలగ మరిగిపోక

మాన రక్షకా మరకతాంగ

నా మనసులోని మర్మమును తెలుసుకో





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి