28, జూన్ 2021, సోమవారం

Nenunnanu : Nenunnanani Song Lyrics (నేనున్నానని)

చిత్రం : నేనున్నాను

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: చంద్రబోస్

గానం:  M.M.కీరవాణి , సునీత


చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ అందరు వున్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుకున్నామని శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి