Nenunnanu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nenunnanu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జూన్ 2021, సోమవారం

Nenunnanu : Ye Shwasalo Song Lyrics (ఏ శ్వాసలో చేరితే )

చిత్రం : నేనున్నాను

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:  చిత్ర


వేణుమాధవా

వేణుమాధవా ఆ.. ఆ... వేణుమాధవా ఆ.. ఆ...

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో

ఆ శ్వాసలో నే లీనమై

ఆ మోవిపై నే మౌనమై

నిను చేరనీ మాధవా.. ఆ.. ఆ

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి

వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా

తనువును నిలువున తొలిచిన గాయమునే, తన జన్మకీ

తరగని వరముల సిరులని తలచినదా

కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది

ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది

వేణుమాధవ నీ సన్నిధి

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో

చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ

నలువైపుల నడి రాతిరి ఎదురవదా

అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి

అలజడితో అణువణువూ తడబడదా

నువ్వే నడుపు పాదమిది

నువ్వే మీటు నాదమిది

నివాళిగా నా మది నివేదించు నిమిషమిది

వేణుమాధవా నీ సన్నిధి

గ గ రి గ రి స రి గ గ రి రి స రి

గ ప ద సా స ద ప గ రి స రి

గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా

గ ప ద స స గ ప ద స స

ద ప ద రి రి ద ప ద రి రి

ద స రి గ రి స రి

గ రి స రి గ రి గ రి స రి గా

రి స ద ప గ గ గ పా పా

ద ప ద ద ద గ స ద స స

గ ద స ప గ రి ప ద ప ద స రి

స రి గ ప ద రి

స గ ప ద ప స గ స

ప ద ప రి స రి ప ద ప రి స రి

ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ

స రి గ ప ద రి గా

రాధికా హృదయా రాగాంజలి

నీ పాదముల వ్రాలు కుసుమాంజలి

ఈ గీతాంజలి


Nenunnanu : Nenunnanani Song Lyrics (నేనున్నానని)

చిత్రం : నేనున్నాను

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: చంద్రబోస్

గానం:  M.M.కీరవాణి , సునీత


చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ అందరు వున్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుకున్నామని శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ..

Nenunnanu : Neekosam Neekosam Song Lyrics (వేసవి కాలం వెన్నెల్లాగ)

చిత్రం : నేనున్నాను

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రేయ ఘోషల్, కే .కే


వేసవి కాలం వెన్నెల్లాగ వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరి కోసం.. తోం ధిరి తోం ధిరి తోం ధిరిధిరిధిరి తోం ధిరి సీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగ లాగ సొగసు ఎవరి కోసం.. తోం ధిరి తోం ధిరి తోం ధిరిధిరిధిరి తోం ధిరి ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండుగ చేసే సందడి వేళ ఆకు వక్క సున్నం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం గుండె చాటుగా ఉండనందిక ఇన్ని నాళ్లు దాచుకున్న కోరికా.. ఉన్నపాటుగా ఆడ పుట్టుక కట్టుబాటు దాటలేదుగా.. కన్నె వేడుక విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా తీగ చాటుగా మూగ పాటగా ఆగిపోకె రాగ మాలికా.. నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనై రానా కొన గోటి కొంటెతనాన నిను మీటనా చెలి వీణ అమ్మమ్మో హబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా నా రేకుల విచ్చే సోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం సిగ్గు కోరిక నెగ్గలేవుగా ఏడు మల్లెలెత్తు సుకుమరమా.. సాయమీయక మోయలేవుగా లేత సోయగాల భారమా.. కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా తాళి బొట్టుగా కాలి మెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా.. మునిపంటి ముద్దర కానా చిగురంటి పెదవుల పైన మురిపాల మువ్వను కానా దొరగారి నవ్వులలోన నిద్దర్లో.. పొద్దుల్లో.. నీవద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువు ముద్దెర లేని పద్ధతిలోనే ముద్దులనెన్నో తెచ్చా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం వేసవి కాలం వెన్నెల్లాగ వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరి కోసం.. తోం ధిరి తోం ధిరి తోం ధిరిధిరిధిరిధిరిధిరి తోం ధిరి సీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగ లాగ సొగసు ఎవరి కోసం.. తోం ధిరి తోం ధిరి తోం ధిరిధిరిధిరిధిరిధిరి తోం ధిరి ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం