చిత్రం : పరుగు
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం : సాకేత్
నమ్మవేమోగాని అందాల యువరాణి , నేలపై వాలింది నాముందే మెరిసింది
నమ్మవేమోగాని అందాల యువరాణి , నేలపై వాలింది నాముందే మెరిసింది
అందుకే అమాంతం నామది , అక్కడే నిశ్శబ్దం ఐనది...
ఎందుకో ప్రపంచం అన్నది , ఇక్కడే ఇలాగే నాతో ఉంది...
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే , చెంపలు కింపు నాణాలై కాంతిని ఇస్తుంటే...
చూపులు తేనే ధారాలై అల్లుకుపోతుంటే , రూపం ఈడు వారాలై ముందర నించుంటే...
ఆసోయగాన్నే నేచూడగానే , ఓరాయిలాగా అయ్యాను నేనే...
అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా...
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది , ఓక్షణమైన అధరాల రంగుని ఇమ్మంది...
వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది, శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది...
ఆఅందమంతా నాసొంతమైతే, ఆనందమైన వందేళ్లు నావే...
కలల తాకిడికి, మనసు తాళధిక, వెతికి చూడు చెలిని...
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...
Best lyrics
రిప్లయితొలగించండిyes.
రిప్లయితొలగించండి