Parugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Parugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఆగస్టు 2023, ఆదివారం

Parugu : Elegeylaga Song Lyrics (ఎలగెలగా ఎలగా ఎలగెలగా..)

చిత్రం: పరుగు (2010)

రచన: అనంత శ్రీరామ్

గానం: కైలాష్ ఖేర్, సైంధవి

సంగీతం: మణి శర్మ




ఎలగెలగా ఎలగా ఎలగెలగా.. ఎలగెలగా ఎలగా ఎలగెలగా.. ఎలగెలగా ఎలగా ఎలగెలగా.. ఎలగెలగా ఎలగా ఎలగెలగా.. ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావూ ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావూ  ఎల్లా నా దారినిట్టా మార్చివేసావూ  ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావూ  ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా పిల్లా నీ లాంటిదాన్నే కోరుకున్నానూ  పిల్లా ఆ మాట నాలో దాచుకున్నానూ పిల్లా నేనింత కాలం వేచి దాచుకునానూ  పిల్లా ఆ చోట నిన్నే చూసుకున్నానూ  ఎలగెలగా ఎలగ ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్చాడూ  సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడూ  ఎలగెలగా ఎలగా  ఇదిగో ఈ పిల్ల నీకు జంట అన్నాడూ  పరుగూన వెల్లమంటూ తన్ను తన్నాడూ  ఎలగెలగా ఎల్లగా  కొండలు దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి  దెబ్బకు అక్కడ ఎగిరి పడ్డాను నీ దగ్గర పడ్డానూ  అలగలగా అలగా అలగలగా  అలగలగా అలగా అలగలగా  అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేసానూ అల్లా నీ లోపలే ఈ గోల పెంచానూ  అల్లా నీ దారినట్టా మార్చివేసానూ  అల్లా నా దారిలోకి తీసుకొచ్చానూ  అలగలగా అలగా అలగలగా అలగలగా అలగా అలగలగా  దినకిట దీగ దీగ దిన దినకిట దీగ దీగన  దినకిట దీగ దీగ దిన దీగ దీగ దిన దీగ దీగన  ఎపుడో మా బామ్మ నాకో మాట చెప్పిందీ  ఎవడో వల వేసి నన్నే లాగుతాడందీ  ఎలగెలగా ఎల్లగా  పోవే నే వెర్రిదాన్ని కాదు అన్నానూ  కాని నువ్వు ముందుకొస్తే ఆగుతున్నానూ  ఎలగెలగా ఎల్లగా  ఎప్పటికప్పుడు ఏమవుతాదని చేయని తప్పులు ఏం చేస్తానని నిద్దరమాని ఆలోచిస్తున్నా నిన్నారా తీస్తున్నా  ఎలగెలగా ఎలగా ఎలగెలగా  అలగలగా అలగా అలగలగా  ఎలగెలగా ఎలగా ఎలగెలగా  ఇలగిలగా ఇలగా ఇలగిలగా ఇలగా 

2, జులై 2021, శుక్రవారం

Parugu : Manakannapodichey Song Lyrics (ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి)

చిత్రం : పరుగు(2008)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం : రాహుల్ నంబియార్



ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి

నిన్నే ఊరించాలని అన్నాయి

ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి

నిన్నే ప్రేమించాలని అమ్మాయి

దూరం పెంచినా కరిగించానుగా

కళ్ళెం వేసినా కదిలొస్తాను గా

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో

ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో

మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో

నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి

నిన్నే ఊరించాలని అన్నాయి

ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి

నిన్నే ప్రేమించాలని అమ్మాయి


అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే

అనుకుంటె అప్సరసైన  నా గుమ్మం లోకొస్తాదే

విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే

చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే

ఇన్నాల్లు భూలోకం లో ఏ మూల ఉన్నావే

అందిస్తా ఆకాసాన్నె

అంతో ఇంతో ప్రేమించావంటే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో

ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో

మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో

నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి

నిన్నే ఊరించాలని అన్నాయి

ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి

నిన్నే ప్రేమించాలని అమ్మాయి


అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే

బలమైన వారధి కట్టి సీతని ఇట్టే పొందాడే

మన మధ్య నీ మౌనం సంద్రంలా నిండిందే

మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే

చంద్రున్నె చుట్టేస్తానే చేతుల్లో పెడతానే

ఇంక నువ్వు ఆలోచిస్తూ

కాలన్నంతా ఖాలీ చెయ్యొద్దే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో

ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో

మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో

నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి

నిన్నే ఊరించాలని అన్నాయి

ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి

నిన్నే ప్రేమించాలని అమ్మాయి

22, జూన్ 2021, మంగళవారం

Parugu : Nammavemo Song Lyrics (నమ్మవేమోగాని అందాల యువరాణి)

 చిత్రం : పరుగు

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం : సాకేత్



నమ్మవేమోగాని అందాల యువరాణి , నేలపై వాలింది నాముందే మెరిసింది


నమ్మవేమోగాని అందాల యువరాణి , నేలపై వాలింది నాముందే మెరిసింది

అందుకే అమాంతం నామది , అక్కడే నిశ్శబ్దం ఐనది...

ఎందుకో ప్రపంచం అన్నది , ఇక్కడే ఇలాగే నాతో ఉంది...

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...

అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...

అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...



నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే , చెంపలు కింపు నాణాలై కాంతిని ఇస్తుంటే...

చూపులు తేనే ధారాలై అల్లుకుపోతుంటే , రూపం ఈడు వారాలై ముందర నించుంటే...

ఆసోయగాన్నే నేచూడగానే , ఓరాయిలాగా అయ్యాను నేనే...

అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా...

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...

అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...

అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...



వేకువలోన ఆకాశం ఆమెను చేరింది , ఓక్షణమైన అధరాల రంగుని ఇమ్మంది...

వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది, శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది...

ఆఅందమంతా నాసొంతమైతే, ఆనందమైన వందేళ్లు నావే...

కలల తాకిడికి, మనసు తాళధిక, వెతికి చూడు చెలిని...

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది...

అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది...