21, జూన్ 2021, సోమవారం

Preminchukundam Raa : Meghale Thakindi Song Lyrics (మేఘాలే తాకింది హై హైలెస్సా)

చిత్రం : ప్రేమించుకుందాం రా(1997)

సంగీతం:  మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



మేఘాలే తాకింది హై హైలెస్సా

నవరాగంలో నవ్వింది నా మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిషా చెలరేగాలి రమ్మంది హల్లో అంటూ ఒళ్లోవాలే అందాల అప్సరస//మేఘాలే// అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ చరణం: 1 తొలిసారి నిను చూసి మనసాగక పిలిచానే చిలకమ్మా మెలమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికావే స్నేహంగా చెలిమన్న వల వేసి నను లాగగా చేరాను నీ నీడ చలచల్లగా గిలిగింత కలిగేలా తొలి వలపంటే తెలిసేలా ఓ..కునుకన్న మాటే నను చేరక తిరిగాను తెలుసా ఏం తోచక//మేఘాలే// చరణం: 2 తొలి పొద్దు వెలుగంత చిరు వేడిగా నిలువెల్ల పులకింత చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది ఈ వింత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కలఏదో మరిపించాగా పగలేదో రేయేదో రెండు కలిసాయి నీ చెంత ప్రేమంటే ఇంతే ఏమో మరి దానంతు ఏదో చూస్తే సరి//మేఘాలే//

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి