Preminchukundam Raa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Preminchukundam Raa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జులై 2021, శుక్రవారం

Preminchukundam Raa : Surya Keeritam Song Lyrics (సూర్య కిరీటమే నీవా )

చిత్రం : ప్రేమించుకుందాం రా(1997)

సంగీతం:  మహేష్ మహదేవన్

సాహిత్యం: భువనచంద్ర

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా నీ ఒడి మన్మధ యాగ సీమ నీ సరి ఎవ్వరు లేరే భామ నీ తోనే పుట్టింది ప్రేమా కణ్వ శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా వాత్సాయన వనవాసినీ కావేరి

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా సొగసు భారమోపలేక నడుము చిక్కిందా జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా తుమ్మెద ఎరగని తేనె పువ్వా సౌందార్యానికి తావి నువ్వా ప్రియమార దరిచేరరావా

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి

22, జూన్ 2021, మంగళవారం

Preminchukundam Raa : Chinni Chinni Gundelo Song Lyrics (చిన్ని చిన్ని గుండెలో )

చిత్రం : ప్రేమించుకుందాం రా(1997) సంగీతం: మహేష్ మహదేవన్ సాహిత్యం: భువనచంద్ర గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర,సంగీత సాజిత్



అంబరాల కోటలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా సన్నజాజి తీగలా ప్రియుణ్ణి ఎట్ట హత్తుకుంది చూడరా లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా పల్లవి: చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా నీడలాగ తోడు ఉంటా పారిజాతమా గుండెల్లోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా చరణం:1 నీ వాకిట ముగ్గునవుతా సందెపొద్దు వాలినాక సిగ్గునవుతా నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా నా నవ్వులే నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా ప్రేమ కన్న గొప్పదేది సృష్టిలోన లేదురా చరణం:2 ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా ఆ మాటే చాలునంట ఎన్ని బాధలైన నేను ఓర్చుకుంటా నీ చేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటా సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా

21, జూన్ 2021, సోమవారం

Preminchukundam Raa : Meghale Thakindi Song Lyrics (మేఘాలే తాకింది హై హైలెస్సా)

చిత్రం : ప్రేమించుకుందాం రా(1997)

సంగీతం:  మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



మేఘాలే తాకింది హై హైలెస్సా

నవరాగంలో నవ్వింది నా మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిషా చెలరేగాలి రమ్మంది హల్లో అంటూ ఒళ్లోవాలే అందాల అప్సరస//మేఘాలే// అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ చరణం: 1 తొలిసారి నిను చూసి మనసాగక పిలిచానే చిలకమ్మా మెలమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికావే స్నేహంగా చెలిమన్న వల వేసి నను లాగగా చేరాను నీ నీడ చలచల్లగా గిలిగింత కలిగేలా తొలి వలపంటే తెలిసేలా ఓ..కునుకన్న మాటే నను చేరక తిరిగాను తెలుసా ఏం తోచక//మేఘాలే// చరణం: 2 తొలి పొద్దు వెలుగంత చిరు వేడిగా నిలువెల్ల పులకింత చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది ఈ వింత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కలఏదో మరిపించాగా పగలేదో రేయేదో రెండు కలిసాయి నీ చెంత ప్రేమంటే ఇంతే ఏమో మరి దానంతు ఏదో చూస్తే సరి//మేఘాలే//

Preminchukundam Raa : Alachudu Premalokam Song Lyrics (అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ)


చిత్రం : ప్రేమించుకుందాం రా(1997)

సంగీతం: మహేష్ మహదేవన్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



పల్లవి:
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ చరణం 1: ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా అదే పాట నా దాక ఏలా చేరనమ్మా ప్రతీ బాట నా వైపే నిన్నే పంపెనమ్మా నిరంతరం నీ వూసేదో నను రమ్మన్నదీ ప్రతి క్షణం నీ ధ్యాసేగా కల వరించి వరించి రప్పించుకున్నది అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ చరణం 2: అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా వెలేవేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం రహస్య రాజ్యం చేరే జత కథే ఇది సుఖాల తీరం కోరే మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ