21, జూన్ 2021, సోమవారం

Priyamaina Neeku : Manasuna Unnadi song lyrics (మనసున ఉన్నది చెప్పాలనున్నది)

చిత్రం : ప్రియమైన నీకు(2000)

సంగీతం: శివ శంకర్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం:చిత్ర



మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేం ఎలా? అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా? ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా? ఒకసారి దరిచేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా!
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేం ఎలా? . చింత నిప్పైన చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని తననే తలచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలొ కనపడుతోందా నా ప్రియమైన నీకు నా యద కోత అని అడగాలనీ అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందనీ తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేం ఎలా?
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని నిదరే కసురుకునే రేయిలో మేలుకున్నాయి ఏం వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని పగలేదో రేయేదో గురుతేలేదని తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేం ఎలా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి