Rudraveena : Nammaku Nammaku Ee Reyini Song Lyrics (నమ్మకు నమ్మకు ఈ రేయిని)
చిత్రం : రుద్రవీణ
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: బాలసుబ్రహ్మణ్యం
సీకటమ్మ సీకటి ముచ్చనైన సీకటిఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటినిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటిముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటిపొద్దు పొడుపే లేని సీకటే ఉందిపోనీమన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీరాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనకానమ్మకు నమ్మకు ఈ రేయినికమ్ముకు వచ్చిన ఈ మాయనినమ్మకు నమ్మకు ఈ రేయినిఅరె కమ్ముకు వచ్చిన ఈ మాయనికన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసినీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసికలలే వలగా విసిరే చీకట్లనునమ్మకు నమ్మకు ఈ రేయినిఅరె కమ్ముకు వచ్చిన ఈ మాయనివెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకురవి కిరణం కనపడితే తెలియును తేడాలన్నినమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయినిఅరె కమ్ముకు వచ్చిన ఈ మాయనిఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలోఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలోపుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్నునిరసన చూపకు నువ్వు ఏనాటికిపక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండపక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అదినమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయినిఅరె కమ్ముకు వచ్చిన ఈ మాయనిశీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలాశీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలామురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేకఎవరికి చెందని గానం సాగించునాపదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదాపదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదాఆనాడు వాసంత గీతాలు పలుకును కదానమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయినిఅరె కమ్ముకు వచ్చిన ఈ మాయనికన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసినీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసికలలే వలగా విసిరే చీకట్లనునమ్మకు నమ్మకు ఈ రేయినిఅరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి