చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996) సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి: మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా జలాల లాలి పాటలో జనించు ప్రేమ బాటలో జలదరింతలో వింతగా జరిగేను సంగమం మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా గల గల గల మిల మిల మిల జల జల జల తళ తళ తళ కనుల తెరల కలల అలల కిల కిల కిల కిల కిల కిల లల లల లల లల లలలా చరణం:1 ఓ హలా....ఇలా.... అలల పల్లకీల తోరణాలు మణులు కురియదా తరంగ తండవాల తళుకు తెలిసెలే ఓ సఖీ....చెలీ.... వలపు సాగరాల ఒడ్డు కోరి నీటి నురగలై స్పృశించగానే నీ పెదాలు వణికెలే నీటి చీర జారుతున్న నిశి రాత్రిలో గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో ఇద్దరం ఈదుతూ ఏ తీరమో చేరితే మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమనీ మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా చరణం:2 ఓ ప్రియా...ప్రియా... ఎదలు ఒక్కసారి పక్కతాళ జతులు కలుపగా నరాల నాగవల్లి సాగే నడుమును నా లయా...క్రియా... తెలిసి తామరాకు తల్లడిల్లి తాళమేయగా సరోజమైన సోకు తాకి చూడనా ప్రేమలోతు అందుకోనిదే తాపము హంసలాగ పైన తేలి ఏం లాభము చేపలా మారితే గాలాన్ని వేసెయ్యనా నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్యు ముద్దుగా మీనా ...ఏమ్మా... మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి