చిత్రం: శీను (1999)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: మణి శర్మ
పల్లవి: ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా నీ పాదాలకే మువ్వలా ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా చరణం: 1 ఆకాశ దేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు నా నావ కోరేటి తీరాలు స్వర్గాల పొలిమేరలు మమతల మధు మధురిమలిటు సరిగమలాయే కలబడు మన మనసుల కలవరమైపోయే గాలుల్లో అందాలు పూలల్లో అందాలు జత చేయు హస్తాక్షరి అభిమానాల అంత్యాక్షరి ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా చరణం: 2 ఎన్నాళ్ళు ఈ మూగభావాలు సెలయేటి తెరచాపలు నాలోని ఈ మౌనగీతాలు నెమలమ్మ కనుపాపలు కుడి ఎడమల కుదిరిన కల ఎదకెదుటాయే ఉలి తగిన శిల మనసున సొద మొదలాయే ఈ సప్తవర్ణాల నా సప్తరాగాల పాటల్లో ప్రథమాక్షరి ఇది ప్రాణాల పంచాక్షరి ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా నీ పాదాలకే మువ్వలా ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి