Seenu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Seenu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2022, ఆదివారం

Seenu : Aatakundo Time Song Lyrics (ఆటకుందో time)

చిత్రం: శీను (1999)

సాహిత్యం: భువనచంద్ర

గానం: శంకర్ మహదేవన్

సంగీతం: మణి శర్మ




Excuse me, time please ఆటకుందో time, అరె మాటకుందో time Heart లోకి దూసుకెళ్ళే పాటకుందో time Dance కుందో time, romance కుందో time మాల్ మసాలా girls తో time పాసుకుందో time High school కి, college కి, ఫ్రెండ్ షిప్పుకున్నదో time ప్రేమించిన వయ్యారితో సయ్యాటకున్నదో time సుఖంగా ప్యారే బతికేదే అసలైన time time ఒక్క smile ఇస్తే satellite అల్లె ఇంటి చుట్టూ రౌండ్సే వెయ్నా Star hotel లో dim light నీడల్లో కోరుకున్న style ల్లో నిను అరెస్టే చెయనా కుదిరితే time time అదరతా game game చలాకి పిల్లా గప్ చుప్ గా గడిపేద్దాం some time ఆటకుందో time, అరె మాటకుందో time Heart లోకి దూసుకెళ్ళే పాటకుందో time Dance కుందో time, romance కుందో time మాల్ మసాలా girls తో time పాసుకుందో time స్టెప్పు స్టెప్పుకి ఉందో రిమ్ జిమ్ బిట్టు బిట్టు కో rhyme అరె left right-u లో లేదే తేడా everything is time Miss-u world అయినా, మిటూరి పాపైనా ఆటకొస్తే ఒకటే సోనా Heart కౌగిట్లో యమ sweet-u ముద్దుల్తో Rap song పాడి ఓ చమకే చెయినా ఇదే good time time time వదిల్తే crime crime crime మజాగా పిల్లా love చేస్తూ బతికేద్దాం life time ఆటకుందో time, అరె మాటకుందో time Heart లోకి దూసుకెళ్ళే పాటకుందో time Dance కుందో time, romance కుందో time మాల్ మసాలా girls తో time పాసుకుందో time High school కి, college కి, ఫ్రెండ్ షిప్పుకున్నదో time ప్రేమించిన వయ్యారితో సయ్యాటకున్నదో time సుఖంగా ప్యారే బతికేదే అసలైన time time

Seenu : Premante Yemitante Song Lyrics (ప్రేమంటే ఏమిటంటే)

చిత్రం: శీను (1999)

సాహిత్యం: వేటూరి

గానం: హరిహరన్, సుజాత

సంగీతం: మణి శర్మ




ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ… ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ...ప్రేమ మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ...ప్రేమ ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని ఇది సంగీతమో తొలి సంకేతమో ఇది ప్రియగీతమో మధు జలపాతమో… ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ...వేళ ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల..చాల కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా ఇది ఆలాపనో మది ఆరాధనో మన సరసాలకే తొలి సంకీర్తనో…. ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఇదివరకు తెలియంది ఈ  అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ… ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

Seenu : O Manali O Manali Song Lyrics (మనుషులంత దూరమైనా)

చిత్రం: శీను (1999)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: సుఖ్వీందర్ సింగ్ , స్వర్ణలత, సంగీత సచిత్

సంగీతం: మణి శర్మ



మనుషులంత దూరమైనా మనసులు చేరువ చేసేదే ప్రేమ మనసులెంత చేరవైనా మనుషుల దూరం చేసేది ప్రేమే ఓ! మనాలి ఓ! మనాలి చేసుకో జాలీ ప్రేమకోసం బెంగపడితే జీవితం ఖాళీ ఓ! మనాలి ఓ! మనాలి చేసుకో జాలీ ప్రేమకోసం బెంగపడితే జీవితం ఖాళీ వద్దందిరా ఏ బాధలు వయ్యారి కూన జల్సాలనే చెయ్యండిరా సిందాడి జాణ వచ్చాడులే ఇన్నాళ్ళకు వాస్కోడిగామ మెచ్చానులే పెద్దింటిలో తీస్కోరా మావా ఓ మనాలి - ఓ! మనాలి - లేదులే జాలి ఓ! మనాలి ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి ఓ! మనాలి ఓరోమియో ఓ జూలియట్ ఆనాటి స్టోరీ ఈ రోజున ఆ ట్రాజెడీ బోరంట సారీ ఆరోమియో ఆ జూలియట్ ఈనాడు లేరా... ఈనాటికి ఆప్రేమను చూపించలేదా నిన్న తిరిగి రాదంట రేపు మనది కాదంట ఈరోజే నీదై గురూ... నిన్న తియ్యని గురుతైతే రేపు కమ్మని కల అయితే ఈ నాటికిది చాలదా... ఓ! మనాలి ఓ! మనాలి లేదులే జాలీ హో.హో.ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి లవ్ అన్నది ఓ బ్రాంతిరా లేదంట హాయి లైఫ్ అన్నది మూడు నాళ్ళురా ఎంజాయి చెయ్యి లవ్ అన్న ఆమాటన్నదే లైఫంట నాకు ప్రేమెంతగా లోతైనదో ఏం తెలుసు నీకు ఎందుకయ్యా ఆవేశం అందదంట ఆకాశం నిచ్చెనలు నువ్వేసినా ఆరదు ఈ ఆరాటం ఆగదు ఈ పోరాటం మాదేవుడే వచ్చినా... ఓ మనాలి - ఓ! మనాలి - లేదులే జాలి ఓ! మనాలి ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి లవ్ అన్నది నవ్వన్న ఆ జల్సాలొ లేదు లవ్ అన్నది ఈ బాదలో వచ్చేది కాదు ఈ గుండెలో ఆ దీపమే ఆరేది కాదు ఏ నాటికి ఈ ఙాపకం మారేది కాదు


6, జూన్ 2021, ఆదివారం

Seenu : Yemani Cheppanu song lyrics (ఏమని చెప్పను ప్రేమా)

చిత్రం: శీను (1999)

సాహిత్యం: వేటూరి

గానం: హరిహరన్

సంగీతం: మణి శర్మ


ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా.. అందని ఆకాశాలే నా తీరాలమ్మా.. ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం ఓఓఓ... అలసట చెందిన కలలకు చందనమలదిన ఆశల్లో నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో.. నీవు నాకు నేను నీకు లోకం అంకితాలు చేసుకున్న శ్లోకం ప్రేమే అనుకోనా... ఏ కంటిపాప చూడలేని స్వప్నం మనసులోన దాగి ఉన్న గానం నీదే ఏమైనా... ఒక తోడు కోరే ప్రాణం ఎద నీడకేలే పయనం హృదయాలు కోరే గమ్యం వెదికే ప్రేమావేశం... ఓఓఓ... విరహపు యాతన విడుదల కోరిన మనసుల జంటల్లో శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో కౌగిలింత చేరుకున్న కాలం కాలమంటుకోని వింత యోగం మనదే అనుకోనా హే... కాంచనాల కన్నె చిలక పలికే కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా... ఆ రాధకే నా గానం ఆరాధనే నా ప్రాణం నా గాథ ఇకపై మౌనం ఇది నా జీవనరాగం

Seenu : Ye Kommakakomma Song Lyrics (ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం)

చిత్రం: శీను (1999)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

సంగీతం: మణి శర్మ


పల్లవి:  ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా  సుమగీతాల సన్నాయిలా  ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా  నీ పాదాలకే మువ్వలా  ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా  ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా  మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం  ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా  చరణం: 1  ఆకాశ దేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు  నా నావ కోరేటి తీరాలు స్వర్గాల పొలిమేరలు  మమతల మధు మధురిమలిటు సరిగమలాయే  కలబడు మన మనసుల కలవరమైపోయే  గాలుల్లో అందాలు పూలల్లో అందాలు జత చేయు హస్తాక్షరి  అభిమానాల అంత్యాక్షరి  ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా  సుమగీతాల సన్నాయిలా  చరణం: 2  ఎన్నాళ్ళు ఈ మూగభావాలు సెలయేటి తెరచాపలు  నాలోని ఈ మౌనగీతాలు నెమలమ్మ కనుపాపలు  కుడి ఎడమల కుదిరిన కల ఎదకెదుటాయే  ఉలి తగిన శిల మనసున సొద మొదలాయే  ఈ సప్తవర్ణాల నా సప్తరాగాల పాటల్లో ప్రథమాక్షరి  ఇది ప్రాణాల పంచాక్షరి  ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా  సుమగీతాల సన్నాయిలా  ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా  నీ పాదాలకే మువ్వలా  ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా  ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా  మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం

Seenu : Hello Neredu Kalla Song Lyrics (హాల్లో నేరేడు కళ్ళదాన)

చిత్రం: శీను (1999)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: పార్థ సారధి,కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ


హాల్లో నేరేడు కళ్ళదాన...ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన హాల్లో వరనాల పూల వాన...నీన్ను జల్లో చూట్టేసి దాచుకోన నమ్మేదేల మైన ఇంత ప్రేమ నా మీదేన కళ్ళో లేదే నాయన అల్లూ కుంటు వల్లో లేన హాల్లో నేరేడు కళ్ళ దాన...ప్రేమ వల్లో పడ్డానే పిల్లాదాన హాల్లో వరనాల పూలవాన...నీన్ను జల్లో చూట్టేసి దాచుకోన దాయి దాయి అనగానే చేతికందెన చంద్రవాదన కుంచై నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినాన బోమ్మ గుమ్మ తేలక మారిపోయ నేనే బోమ్మగ ఏదో చిత్రం చేయగ చేరువయ్యా నేనే చేలిగ రేప్ప మూసిన తప్పుకోనని కంటిపాప ఇంటిలోన ఏరికోరి చేరుకున్న దీపమ హాల్లో నేరేడు కళ్ళదాన...ప్రేమ వల్లో పడ్డానే పిల్లాదాన హాల్లో వరనాల పూలవాన...నీన్ను జల్లో చూట్టేసి దాచుకోన అణ్యం పుణ్యం లేని వాడని అనుకున్నాను ఇన్నినాలు అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నే కళ్ళు మైకం పెంచే మాయతో ముగసైగే చేసే దాహామ మౌనం మీటే లీలతో తెరి రాగం నేర్పే స్నేహమ వంటరైనన నా గుండే గుటిలో సంకు రాత్రి పండగంటి సందడల్లే చేరుకున్న రూపమ హాల్లో నేరేడు కళ్ళదాన...ప్రేమ వల్లో పడ్డానే పిల్లాదాన హాల్లో వరనాల పూలవాన...నీన్ను జల్లో చూట్టేసి దాచుకోన