చిత్రం : సీతాకోక చిలుక
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్
ఆ హా హా హా, ఆ హా హా హా ఆ హా హా హా, ఆ హా హా హా మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే పొందు ఆరాటాల పొంగు పోరాటాల మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా బుగ్గ దాచుకుంటే బులపాఠాలా దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా ఈడు కున్న గూడు నువ్వే గోరింకా తోడుగుండి పోవే కంటి నీరింకా పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా మిన్నేటి సూరీడు లాలలాల మిన్నేటి సూరీడు లాలలాల లాలలాల మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి