7, జూన్ 2021, సోమవారం

Simharasi : Telusa Nesthama song Lyrics (తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ)

చిత్రం : సింహరాశి (2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్  రచన : వెనిగళ్ళ రాంబాబు గానం : హరిహరన్, సుజాత



తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా మౌనమే కరగాలి మంత్రమై మ్రోగాలి మదిలో నీ ప్రేమ మందిరమవ్వాలి మమతలే పండాలి మనసులే నిండాలి దైవం పలకాలి దీవెనలివ్వాలి ప్రేమపైన నమ్మకాన్ని పెంచుకున్న చిన్నదాన్ని ప్రేమతోనే జీవితాన్ని పంచుకుంటూ ఉన్నవాణ్ని చెప్పలేని ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ ఎదురుగా రారాజు కదలగా ఈరోజు పరువం పులకించి పరుగులు తీసింది ఓ.... ప్రేమలో మమకారం ఏమిటో తెలిసింది పున్నమిలా ఎదలో వెన్నెల కురిసింది నింగి విడిచి గంగలాగ నిన్ను చేరుకున్నదాన్ని కొంగులోనే దాచుకోవే పొంగుతున్న సాగరాన్ని ఆడపిల్ల మనసు తెలిసిన తోడు నీడ నీవే తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి