Simharaasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Simharaasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2022, శనివారం

Simharasi : Pedalante Song Lyrics (పేదలంటే ప్రాణమిచ్చే )

చిత్రం : సింహరాశి (2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్  రచన : వెనిగళ్ళ రాంబాబు గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత




పల్లవి : పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥ దానవీరశూరకర్ణ నరసింహరాజు సింహరాశిలో నువు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా

పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥ చరణం : 1 పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటిచూపుల్లో సూరీడే నీవు ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై ॥॥ చరణం : 2 కటిక నేలే నీ పట్టుపరుపు పూరి గుడిసెను గుడి చేసినావు కట్టుపంచే నీకున్న ఆస్తి కోట్లు ఉన్న నిరుపేదవయ్యా కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు కన్నోళ్ల కలలే పండించినావు ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది

25, జులై 2021, ఆదివారం

Simharasi : Amma Ane Pilichi Song Lyrics (అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా)

చిత్రం : సింహరాశి (2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్ 

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్.జానకి




అమ్మ కు అంకితం:జోలాలిజో లాలిలాలి జోలాలిజో అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా,

ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా  గర్భగుడిలాంటి అమ్మ ఒడి పాము పడగయ్యిందిరా,

చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలిపడరా" అమ్మ అని పిలిచి గుండె పిండకురా.. విషం కూడ అమృతమే అమ్మ తాకితే,

నీ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా

బ్రహ్మ ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకోని జన్మ,

రమ్మనలేను చేరగ నేను శిలనునేనురా

అమ్మ అని పిలిచి పిలిచి గుండె పిండకురా.. లాలిజో లాలి లాలిజో లాలిజో లాలిజో కంటీనీటితోనే నీ కడుపునింపుకో ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో సింహరాశి లో పుట్టిన సూర్యుడే నీవురా నిన్ను మోసి కన్న ఆశలే

నీకు దీవెనవవా అందరికంటి కాంతిగ మారి

7, జూన్ 2021, సోమవారం

Simharasi : Telusa Nesthama song Lyrics (తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ)

చిత్రం : సింహరాశి (2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్  రచన : వెనిగళ్ళ రాంబాబు గానం : హరిహరన్, సుజాత



తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా మౌనమే కరగాలి మంత్రమై మ్రోగాలి మదిలో నీ ప్రేమ మందిరమవ్వాలి మమతలే పండాలి మనసులే నిండాలి దైవం పలకాలి దీవెనలివ్వాలి ప్రేమపైన నమ్మకాన్ని పెంచుకున్న చిన్నదాన్ని ప్రేమతోనే జీవితాన్ని పంచుకుంటూ ఉన్నవాణ్ని చెప్పలేని ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ ఎదురుగా రారాజు కదలగా ఈరోజు పరువం పులకించి పరుగులు తీసింది ఓ.... ప్రేమలో మమకారం ఏమిటో తెలిసింది పున్నమిలా ఎదలో వెన్నెల కురిసింది నింగి విడిచి గంగలాగ నిన్ను చేరుకున్నదాన్ని కొంగులోనే దాచుకోవే పొంగుతున్న సాగరాన్ని ఆడపిల్ల మనసు తెలిసిన తోడు నీడ నీవే తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా