చిత్రం: స్టూడెంట్ నెంబర్.1 ( 2001 )
రచన: చంద్రబోస్
గానం: కె.కె, శ్రీవర్తిని
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే
అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా ?? కాదంటారా ??
ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే
చరణం 1:
దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే కష్టం కలిగిన ప్రతి పనిలో సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెన్నుతట్టి మెచ్చుకుంటే దాపరికాలే లేకుంటే.. లోపాలను సరిచేస్తుంటే ఆటాపాటా ఆనందం అన్నీ చెరిసగమవుతుంటే ప్రేమంటారా ?? కాదంటారా !! ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే చరణం 2:
ఓ మనోహరీ చెలీ సఖీ ! ఓ స్వయంవరా దొరా సఖా ! మనసు నీదని మనవిసేయనా సఖీ బ్రతుకు నీదనే ప్రతినబూననా సఖా నిను చూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ !! నీ చెలిమి లేని క్షణములోన జగతిని జీవింపజాలనో సఖా !! ఆ.. ఆ.. ఆ.. ఆ.... నటనకు జీవంపోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తోంటే అటుపై సెలవని వెళుతుంటే నీ మనసే కలవరపడుతుంటే ప్రేమంటారా ?? ఔనంటాను....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి