చిత్రం: స్టూడెంట్ నెంబర్.1 ( 2001 )
రచన: చంద్రబోస్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
చరణం 1: అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే చిన్ననాడె అన్న ప్రాసనయ్యిందోయ్ కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్ అమ్మచేతి గోరు ముద్దతిన్నానోయ్ అందగాడి గోటి ముద్ర కావాలోయ్... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ... కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది చరణం 2:
మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే బుగ్గలోన పండుతుంది జాంపండు పక్కలోన రాలుతుంది ప్రేంపండు రాతిరేళ వచ్చిపోరా రాంపండు బంతులాడి పుచ్చుకోరా భాంపండు... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ... కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి